38.2 C
Hyderabad
April 25, 2024 13: 58 PM
Slider ప్రకాశం

ఆమంచి కుటుంబం బెదిరింపులపై ఫిర్యాదుల ‘‘మాయం’’ కేసు విచారణ షురూ

#chirala

ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కుటుంబీకులు ఓటర్లను బెదిరింఛి భయబ్రాంతులకు గురిచేయడం పై ఇచ్చిన ఫిర్యాదులు ‘‘మాయం’’ కావడంపై రాష్ట్ర సమాచార కమీషన్ విచారణకు ఆదేశించింది. ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామస్తుడు, విజిల్ బ్లోయర్ నాయుడు నాగార్జున రెడ్డి 2019 మార్చి 26న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేశారు.

తాను, తనతో బాటు చీరాలకు చెందిన ప్రజాసంఘాల ప్రతినిధులు స్వయంగా కలిసి ఇచ్చిన ఫిర్యాదు ల పై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికి నాగార్జున రెడ్డి ఆగస్టు 17 న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కోరారు. అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో నాగార్జున రెడ్డి రాష్ట్ర సమాచార కమీషన్ ను ఆశ్రయించారు.

రాష్ట్ర సమాచార కమీషన్ నాగార్జున రెడ్డి పిటిషన్ కు స్పందించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి నోటీసులు జారీచేసింది. దాంతో కదిలిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి కార్యాలయం సదరు 6(1) దరఖాస్తుకు సమాధానం ఇవ్వాల్సినదిగా 2020 అక్టోబర్ 20 న ప్రకాశం జిల్లా కలెక్టర్ కు పంపింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు ఆ పిటిషన్ ను చీరాల తాహశీల్దార్ కు, వేటపాలెం తాహశీల్దార్ కు పంపారు.

చివరగా ఆ దరఖాస్తులన్నీ వేటపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. వేటపాలెం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కమలాకర్ నాగార్జున రెడ్డి దరఖాస్తుకు సమాధానం ఇస్తూ 2019 ఎన్నికలలో ఆమంచి కృష్ణమోహన్ కుటుంబం ఓటర్లను బెదిరించిన విషయమై తమ కార్యాలయానికి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు.

ఫిర్యాదు అందనందువల్ల ఎటువంటి చర్యలు చేపట్టలేదని ధ్రువీకరించారు. నాగార్జున రెడ్డి ఫిర్యాదుపై సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం సమాచారం కోరగా సదరు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వ్యతిరేక సమాధానం రావడంతో ఆగ్రహించిన రాష్ట్ర కమిషన్ సదరు ఫిర్యాదులు అదృశ్యం పై విచారణ చేపట్టవలసిందిగా  ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పీలుదారునికి అందిన సమాధానం ప్రకారం దరఖాస్తు అనేక కార్యాలయాలకు బదిలీ చేయబడి చివరికి వేటపాలెం పోలీస్టేషన్ కు చేరినట్లు స్పష్టమైంది.  కానీ సదరు ఫిర్యాదులు కానీ, ఫిర్యాదులపై దాఖలైన సమాచార హక్కు చట్టం – 2005 దరఖాస్తు గానీ తమకు అందుబాటులో లేదని వేటపాలెం పోలీస్ స్టేషన్ వారు చెబుతున్నారు.

అందువల్ల సంబంధిత మొత్తం కార్యాలయాల నుండి సంబంధిత పత్రాలను తెప్పించేందుకు సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 18(1) ప్రకారం విచారణ నిర్వహించేందుకు లా సెక్రటరీకి అధికారాలు అప్పగిస్తూ రాష్ట్ర సమాచార ప్రధాన కమీషనర్  పి.రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్ అందిన 60 రోజుల లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించ వలసింది గా లా సెక్రటరీ ని ఆదేశించారు.

Related posts

విక‌లాంగుల ట్రై సైకిల్ క్రికెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆంధ్ర టైగ‌ర్స్

Satyam NEWS

ఎలర్ట్: కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment