27.7 C
Hyderabad
April 26, 2024 05: 05 AM
Slider ఖమ్మం

విద్యారంగం లో మౌలిక వసతుల కల్పనకు కృషి

#MLA Haripriya

తమ ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులను  ఖర్చు చేస్తుందని  ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ తెలిపారు.

కామేపల్లి మండల పరిధిలోని ముచ్చర్ల  జాస్తి పల్లి హైస్కూల్ లో  ఆర్ ఎం ఎస్ ఏ నిధులు  40 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి  ఆమె శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని  వెల్లడించారు.

ఎంతో కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న దళితులను లక్షాధికారులను చేయడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని దీంతో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు.

అనంతరం కామేపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో 72మందికి  71 లక్షల 59వేల 236 రూపాయల  చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ లు నిక్కిలి కళావతి ,లూసి   కామేపల్లి ఎంపీపీ బానోత్ సునీత రాందాస్, జడ్పిటిసి సభ్యులు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు కే మంజుల, ఎం నరసింహారావు, రాంరెడ్డి జగన్నాథ రెడ్డి, సునీత లక్ష్మీనారాయణ,

కామేపల్లి మండల టిఆర్ఎస్  అధ్యక్షులు ఎ అచ్చయ్య,  కామేపల్లి కొండాయిగూడేం సొసైటీ చైర్మన్ లు  చిదంబర రావు, హనుమంతరావు కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు గింజల నరసింహ రెడ్డి,  యూత్ కాంగ్రెస్ కామేపల్లి మండల అధ్యక్షులు డి రామకృష్ణ, కామేపల్లి ఎంపీడీవో సిలార్ సాహెబ్ , తహసీల్దార్  దార ప్రసాద్,  గురు దీపక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

వంటింటి ఘుమ ఘుమలు

Satyam NEWS

క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బయో-బబుల్ నుంచి విముక్తి

Sub Editor

ఇంట్లో పెట్రోలు నిల్వతో చెలరేగిన మంటలు

Satyam NEWS

Leave a Comment