నూతనంగా నిర్మించిన తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను మండిపల్లి రోడ్ నుండి, తంగళ్లపల్లి లో గల తాడూరి రోడ్ కి మార్చడం జరిగిందన్నారు. నూతన పోలీస్ చాలా విశాలంగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడం జరిగిందని, స్థానిక పోలీసులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండి ఉన్నతమైన సేవలు అందించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు, ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మరిన్ని మొక్కలు నాటాలని చుట్టుపక్కల మరిన్ని మొక్కలు నాటాలని ఎస్సైకి, సిబ్బందికి సూచించారు. తంగాలపల్లి నూతన పోలీస్ స్టేషన్ ఎస్ఐ రూమ్, వెయిటింగ్ హాల్, ఉమెన్ రెస్ట్ రూమ్, తదితర రూములు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడం జరిగిందన్నారు. ఈరోజు నుండి నూతన పోలీస్ స్టేషన్ మండల ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, ఎస్ఐ సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సేవలందించి డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం పోలీసులకు మెరుగైన సేవలు గురించి అన్ని సదుపాయాలు కలిగించటం జరిగిందని, టెక్నాలజీ ద్వారా కేసును ఛేదించడం, మరియు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు,తదితరులు పాల్గొన్నారు.