27.7 C
Hyderabad
April 26, 2024 04: 53 AM
Slider ముఖ్యంశాలు

డయల్100 ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి హాఫ్ మారథాన్ లో రికార్డు

#venkatreddy

హైదరాబాద్ డిజిపి కమాండ్ కంట్రోల్ డయల్100 ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి హాఫ్ మారథాన్ లో రికార్డు సృష్టించారు. దేశ వ్యాప్తంగా ఏటా నిర్వహించే టాటా  ముంబాయి మారథాన్ పరుగు పందెంలో ఆయన జనవరి 15న  హాఫ్ మారథాన్ లో పాల్గొన్నారు. దాదాపుగా 56 వేల మంది ఈ 15న  హాఫ్ మారథాన్ లో పాల్గొన్నారు. 21.10 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ రన్ ను ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి కేవలం 1గంట 50 నిమిషాలలో పూర్తి చేశారు. 45 నుంచి 49 వయసు కేటగిరీలో 80వ స్థానం సాధించి మెడల్ ను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే 6 హాఫ్ (21k) మారథాన్ లు, 10 (పది) 10K పరుగు పందెంలలో పాల్గొన్న ఆయన మెడల్స్ సాధించారు. ఈ ఘనత సాధించిన ఇన్స్పెక్టర్ ని ఉన్నత అధికారులు తోటి సిబ్బంది అభినందించారు.

Related posts

పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన రాగిడి

Satyam NEWS

ఉపాధి హామీ పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి

Satyam NEWS

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Satyam NEWS

Leave a Comment