32.2 C
Hyderabad
March 28, 2024 22: 16 PM
Slider కృష్ణ

నెలకుర్రు గొల్లపాలెం గ్రామంలో శ్రీకృష్ణ శిలావిగ్రహ ప్రతిష్టాపన

#Sri Krishna

పవిత్రమైన జేష్ట శుక్ల ఏకాదశి రోజున, మీ అందరి కోరికకు ప్రార్థనకు కరిగి యాదవ కులానికి కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణుడు వంటరిగా నెలకుర్రు గ్రామానికి రాలేదని తనతో పాటు సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి చదువుల తల్లిని వెంట తెచ్చుకున్నారని కనుక ఇకపై కృష్ణ బాసర నెలకుర్రు గొల్లపాలెం నిరక్ష్యరాస్యులు ఉండరాదని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామీ అభిలషించారు.

బుధవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం, పెదయాదర సమీపంలోని ఎన్. గొల్లపాలెం గ్రామంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ, సరస్వతీమాత దేవాలయాల శిలావిగ్రహ, ధ్వజస్తంభముల ప్రతిష్టాపన మహోత్సవంకు హాజరై తన దివ్య హస్తములతో నిర్వహించారు.

అనంతరం త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామీ సభలో మాట్లాడూతూ, మీ గ్రామం చిన్నదే కానీ, మీ సంకల్పం చాలా ఉన్నతమైనది నెలకుర్రు గ్రామస్తులను స్వామీజీ అభినందించారు. మీరందరు ఏకమై ప్రేమతో పిలిచిన భగవంతుడు వస్తుంటే మీతో కలిసి చూసే అదృష్టం నాకు కల్గిందన్నారు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాలలో కట్టాల్సిన ఆలయం ఒక మారుమూల కుగ్రామంలో అత్యంత సుందరంగా నిర్మించుకోవడం గొప్ప భాగ్యం అన్నారు.

భగవంతుడీని ఆలయంలోనే చూస్తామని, జై శ్రీమన్నారాయణ అది ఒక వ్యక్తి పేరు కాదని , మనిషి ఎలా ఉండాలని చాటిచెప్పే గొప్ప గొప్ప తత్వమని ఆ వాక్యంలో ఒక్కో పదం ఒక్కో అర్దానిస్తూ మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుందని వెయ్యేళ్ళ క్రితం రామానుజులు ఆచరించి చూపిన మార్గమిదని అశాంతి లేని సమాజం కోసం మనం ఆ బాట పట్టాలని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామీ పేర్కొన్నారు.

అనంతరం మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మాట్లాడుతూ, ఆధ్యాత్మిక భావనలు, ధార్మిక తత్వం,దేవునిపై అచంచల విశ్వాసం భక్తి నీతి నిజాయితీలు అధికంగా ఉన్న నెలకుర్రు గ్రామస్థులు వ్యవసాయం,పాడి పశుపోషణపై ఆధారపడతారని అయితే , దేవుడిని నమ్ముకున్న ఈ ప్రజల సంతానంను దేవుడు

దీవించి విద్యాధికులుగా మార్చారన్నారు దాదాపు ఈ వూర్లో ప్రతి ఇంట ఒక డాక్టర్ లేదా ఇంజినీర్, సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు దేశ విదేశాలలో పనిచేస్తున్నారన్నారు. ఊరు మొత్తం ఐక్యంగా నిలిచి శ్రీ భగవాన్ శ్రీకృష్ణ, సరస్వతీమాత దేవాలయాలను నిర్మించుకోవడం ఎంతో ఆదర్శమన్నారు

ఈ కార్యక్రమంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ & సరస్వతీమాత ఆలయాల కమిటి ఆలయ కమిటీ సభ్యులు జడ్డు వెంకట గణపేశ్వరరావు ( గణేష్ ), జడ్డు సాంబశివరావు, దోక్కు సుబ్బారావు, డొక్కు వీవి అంకినీడు, జడ్డు గోగులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మాజీ జెడ్పిటిసి లంకే వెంకటేశ్వరరావు (ఎల్వీయార్) సర్పంచ్ బండి దేవానంద్, మాజీ సర్పంచ్ వడ్డీ కాసులు, డాక్టర్ శంకర్, పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు

Bhavani

‘మీతోనే మేం దేనికైనా’ కరపత్రాల పంపిణీ

Bhavani

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం

Satyam NEWS

Leave a Comment