28.7 C
Hyderabad
April 25, 2024 05: 49 AM
Slider గుంటూరు

దళిత సర్పంచ్ పై వివక్షచూపిన అధికారులు

#dalit surpanch

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో ఈరోజు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగితే ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన గ్రామ సర్పంచ్ ను ఆహ్వానించకుండా అధికారులు వివక్షత చూపించారని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.

ఈరోజు రొంపిచర్ల మండలం రెడ్డిపాలెం గ్రామ పరిధిలోని మర్రిచెట్టుపాలెంలోని సర్పంచ్ బత్తుల నాగమ్మ ఆమె భర్త అంజయ్య ద్వారా విషయం తెలుసుకున్న రమేష్ కుమార్ వారిని కలిశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులైన ఎండీవో,ఇవో పీఆర్డీ పాల్గొని సర్పంచ్ గ్రామంలో ఉన్నప్పటికీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారని తెలిపారు.

అంతే కాకుండా సర్పంచ్ కు ఒక కుర్చీ కేటాయించి ఆ కుర్చీకి సర్పంచ్ బత్తుల నాగమ్మ అని కరపత్రం అంటించడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.

తక్షణమే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్  స్పందించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రమేష్ కుమార్ డిమాండ్తె చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల నాగమ్మ,ఆమె భర్త అంజయ్య,బత్తుల కోటయ్య పాల్గొన్నారు.

Related posts

‘ఢిల్లీ’ చీవాట్లతో మంత్రి కొడాలి నాని నోటికి తాళం

Satyam NEWS

కాంగ్రెస్ ను దెబ్బకొట్టిన కోమటిరెడ్డి

Satyam NEWS

ఓటు నమోదుకు 19వరకు గడువు

Bhavani

Leave a Comment