మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు విలేకరులను అనుమతించకపోవడం అటుంచి తీవ్ర అవమానానికి గురి చేశారు. నేడు మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నది. టిఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి సీల్డ్ కవర్ లో వచ్చిన పేర్లను కౌన్సిలర్లు ఆమోదించడం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తదితర అంశాలు జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులను మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు లో తీవ్రంగా అవమానించారు. ఈ రోజు మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారానికి మీడియా మిత్రులకు ఆహ్వానం ఉన్నప్పటికీ పోలీసులు ఆఫీసులోకి అనుమతి లేదు. దీంతో అందరూ బైటికి వెళ్ళిపోయారు. తర్వాత మళ్లీ పిలిపించారు. జరిగిన అవమానంతో బయటకు వచ్చారు.
previous post