27.7 C
Hyderabad
April 26, 2024 04: 19 AM
Slider నిజామాబాద్

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్: నగదు, బంగారం స్వాధీనం

#kamareddypolice

కరుడుగట్టిన అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో ఇందిరానగర్ కాలనిలో జరిగిన 90 వేల నగదు దొంగతనం కేసులో కేసు నమోదు చేసిన పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

నేడు రామారెడ్డి చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తపోయించుకపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. బాన్సువాడ ప్రాంతానికి చెందిన దుండగుల ఎల్లప్ప అలియాస్ కాశినాథ్ గా గుర్తించామని, పోలీసుల విచారణలో కామారెడ్డిలో నమోదైన 8 కేసులలో నిందితునిగా ఉన్నట్టు ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు.

బాన్సువాడలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి వచ్చి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు వెల్లదించారు. గతంలో జిల్లాలో ఇతనిపై 28 కేసులు ఉన్నాయని, 7 నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నాయన్నారు. హైదరాబాదులో తప్పుడు సమాచారం ఇచ్చి పాస్ పోర్టు తీసుకుని సింగపూర్, మలేషియా వెళ్లి వచ్చాడని, పాస్ పోర్ట్ తీసుకున్న కేసుపై అక్కడి పోలీసులకు సమాచారమిస్తామన్నారు.

జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి ఇంట్లో 2 లక్షలు, నాలుగు తులాల బంగారం దోచుకున్నాడని, చోరీ జరిగిన ఆవేదనతో వ్యాపారి మృతి చెందడంతో పరోక్షంగా వ్యాపారి మృతికి కారణమయ్యాడని వెల్లడించారు. ఎల్లప్పతో పాటు కామరెడ్డికి చెందిన ఉప్పు రాములు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇద్దరి వద్ద నుంచి 2.20 లక్షల నగదు, 4 తులాల బంగారం, 32, 50, 40 ఇంచెస్ గల టీవీలు, ఒక హోమ్ థియేటర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇరువురిపై పిడి యాక్టు నమోదుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి రివార్డు అందజేశారు.

రైతు ఆందోళనలో కేసుల నమోదు

ఇటీవల మాస్టర్ ప్లాన్ రద్దు విషయమై మూడు రోజుల పాటు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలో 4 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని, పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల ఆందోళనలో పోలీసులు సంయమనం పాటించినా కొందరు అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలు నమ్మవద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని రైతులకు సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో వినతిపత్రాన్ని ఇవ్వడానికి వస్తే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఇలాగే దాడులు చేస్తే చట్టం తనపని తాను చెలుకుపోతుందని చెప్పారు. ఆందోళనలో గోడ దూకిన వారు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారు, పోలీసులపై దాడికి పాల్పడి దూషించిన వారందరిపై కేసులు నమోదవుతాయన్న ఎస్పీ వెల్లడించారు.

తమవద్ద వీడియో ఏవిడెన్స్ ఉందని, వాటి ప్రకారం ఒక్కొక్కరిని గుర్తిస్తున్నామని తెలిపారు. తప్పు చేస్తే ఎవరిపైన అయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఎస్పీ సోమనాథం, కామారెడ్డి పట్టణ, రూరల్ సిఐలు నరేష్, శ్రీనివాస్ గౌడ్, సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ క్రీడాకారులతో మంత్రి ఆర్కే రోజా ముఖాముఖి

Satyam NEWS

జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment