31.2 C
Hyderabad
April 19, 2024 04: 02 AM
Slider కడప

రాజంపేట లో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్ట్

#KadapaPolice

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపుతోంది.

మొత్తం 21 మంది దోపిడీ దొంగలను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ దొంగల ముఠా జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు  స్కెచ్ వేశారు.

గత రెండు రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.

వీరి నుంచి ₹10,360/- నగదు, పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు బులెట్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ దొంగలను మీడియా ముందు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రవేశపెట్టారు. 16 నెలల క్రితం వీళ్ళు కర్ణాటక లోని బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు విచారణ లో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.

బళ్లారి లోని లిక్కర్ షాప్ యజమాని ఇంట్లో 150 కోట్లు ఉన్నట్లు దోపిడీకి ప్రయత్నించి వాచ్ మెన్ ను కట్టేసి దోపిడీ కి ప్రయత్నించగా విఫలమైందని తెలిపారు.

చాలా ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడేవారన్నారు. జిల్లాలో దొంగతనాలు చేయాలని రెక్కీ చేస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు.

వీరిని పట్టుకునేందు కృషి చేసిన రాజంపేట డిఎస్పీ నారాయణ స్వామి , తో పాటు సిఐలు ఎస్సైలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి  రివార్డులు అందజేశారు.

Related posts

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

మునిగిన ఇళ్లకు పరిహారం పంచిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్వాసన?

Satyam NEWS

Leave a Comment