32.2 C
Hyderabad
March 29, 2024 00: 56 AM
Slider ఆదిలాబాద్

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు

#InterStateThieves

ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 8న అర్ధరాత్రి 8 లక్షల విలువైన భారీ చోరీ జరగడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం, సవాలుగా తీసుకొని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, నియమించిన ప్రత్యేక బృందం టాస్క్ ఫోర్స్ సి ఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో సాంకేతిక బృందం ఇంచార్జ్ సింగజ్ వార్ సంజీవ్ కుమార్, సహకారంతో నిందితులను 20 రోజుల్లోనే కేసును ఛేదించి పురోగతి సాధించారు.

శనివారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, స్వాధీనం చేసుకున్న ఎనిమిది లక్షల సిగరెట్ ప్యాకెట్ లను చోరీకి పాల్పడ్డ కేసు పూర్వాపరాలను వెల్లడించారు.

అంబేద్కర్ చౌక్ వద్ద బి రాములు కాంప్లెక్స్ లోని ఐఏ ట్రేడర్స్ యజమాని ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దుకాణం షట్టర్ పగలగొట్టి 8 లక్షల విలువైన సిగిరెట్ ప్యాకెట్ లను దుండగులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కేసు ఛేదించడానికి నియమించిన ప్రత్యేక బృందం అధికారులు ముందుగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు వెల్లడించారు.

ఈరోజు తెల్లవారుజామున రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిందితులు మహారాష్ట్ర లోని ముకుంద్ నగర్ కాలనీ అహ్మద్ నగర్ జిల్లా కు చెందిన ఆరిఫ్ షేక్, సలీం దగుడే పఠాన్ ఎలియాస్ సలీం భగవాన్, షరాఫత్ అలీ లను అరెస్టు చేసి, దాచి ఉంచిన చోరి సొత్తును మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.

మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితులు మోమిన్ సోహెల్ ఎలియాస్ షేక్ సోహెల్, కమలేశ్ తివారి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నిందితులను గుర్తుపట్టడానికి దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ లు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.

ఈ సమావేశంలో ఒకటో పట్టణ సీఐ కె.రామకృష్ణ, టాస్క్ ఫోర్స్ సిఐ ఈ చంద్రమౌళి, ఎస్సై జి. అప్పారావు, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు ఎస్కే తాజుద్దీన్, రమేష్ కుమార్, ఎం ఏ కరీం, సయ్యద్ జాకీర్ అలీ, మంగల్ సింగ్, సయ్యద్ రాహత్, హనుమంతరావు, ఠాకూర్ జగన్ సింగ్, సిసి టిఎన్ఎస్ జిల్లా ఇన్చార్జి సింగజ్ వార్ సంజీవ్ కుమార్, ఎం ఏ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టాలి

Satyam NEWS

‘గ్రీన్’ కోసం నేను సైతం అంటున్న సోనీ చరిష్ఠ

Satyam NEWS

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా

Satyam NEWS

Leave a Comment