26.2 C
Hyderabad
February 14, 2025 01: 20 AM
Slider పశ్చిమగోదావరి

గర్భం దాల్చిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని

#rapecase

ఆమె ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని. తెలిసీ తెలియక చేసిన తప్పుతో గర్భం ధరించింది. తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను భరించింది. భూమ్మీద పడిన ఆ రక్తస్థ శిశువును నాలుగు అంతస్థుల భవనంపై నుంచి విసిరేసి ప్రాణాలు తీసింది. ఈ అపర కుంతీదేవీ జీవితం మరో రాములమ్మ కథగా మారటంతో.. సభ్య సమాజం జాలిపడాలో.. ఈసడించుకోవాలో.. అర్థం కాక జుట్టుపీక్కుంటోంది. ఇక ఈ అమానుష ఘటనతో చలించిన పోలీసులు తీవ్రంగా స్పందించారు. అసలు కారకులను జల్లెడ పడుతున్నారు.

ఈ దారుణ ఘటన ఏలూరు నగరంలో ఆదివారం కలకలం సృష్టించింది. ప్రాథమిక సమాచారం మేరకు,  ఏలూరు అశోక్ నగర్ అమలోద్భవి స్కూల్ సమీపంలో ఈ అమానుష ఘటన  చోటుచేసుకుంది. ఇక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్లో  కర్నూలుకు చెందిన సెకండింటర్   విద్యార్థిని నెలతప్పింది. ఈ విషయాన్ని గుట్టుగా భరించింది. ఇక ఆదివారం తెల్లవారుజామున ప్రసవ వేదనతో ఆమె తల్లడిల్లితుంటే, హాస్టల్ లోని సహచరులు సాయం చేశారు.  ఓ ఆడపిల్లను ప్రసవించింది. డెలివరీ తర్వాత పసికందు మృతదేహాన్ని రహస్యంగా హాస్టల్ టెర్రస్ మీద నుంచి కిందికి వదిలేశారు.

రక్తంతో ముళ్ల పొదల్లో పడిన పసికందు మృతదేహాన్ని అక్కడి గార్డు గుర్తించి.. ఎవరో ఆడపిల్ల మృతదేహాన్ని విసిరివేశారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే తరుణంలో బకెట్లతో నీటిని టెర్రస్ పైకి తీసుకువెళ్లి కొందరు  శుభ్రం చేస్తున్న దృశ్యాన్ని ఆ పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ వాసులు గమనించారు. సెల్ ఫోన్ తో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. వీడియోను జూమ్ చేసి పరిశీలించగా రక్తం కనిపించింది. దీంతో ఇక్కడేదో జరగరానిది జరిగిందని అపార్ట్ మెంట్ జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఏలూరు టూటౌన్ పోలీసులు  ఆ హాస్టల్ కు వెళ్లారు.  ఏలూరు డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం  ఆధారాలు సేకరించే పనిలో పడింది. హాస్టల్ లో ఉంటున్న   సెకండింటర్  విద్యార్థిని ఈ శిశువును  ప్రసవించినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక అసలు కారణాలను తెలుసుకునేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులను రప్పించేందుకు పోలీసు బృందాలను పంపించారు.

ఈ ఘటనలో బిడ్డను ప్రసవించిన చిట్టి తల్లి మైనర్ కావటంతో.. పోలీసులు అసలు డొంకను కదిలిస్తున్నారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచీ ఈ హాస్టల్ లోనే ఉంటోంది. రోజు కాలేజీకి వెళ్తుంటే.. ఈమె శరీరంలో మార్పులను అటు కాలేజీ.. ఇటు హాస్టల్ నిర్వాహకులు గుర్తించలేదా? కనీసం ప్రశ్నించలేదా? ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపారా? లేదా? అదే జరిగితే తల్లిదండ్రులు ఈమెను ఇక్కడే ఎందుకు వదిలేశారు? ఇంతకీ ఆమె  గర్భానికి కారకులెవరు? ఇంత రహస్యం దేనికి?

ఆమె గర్భం ధరించిన విషయం తెలియక పోతే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఆమెను బిల్డింగ్ టెర్రస్ పైకి ఎవరు తీసుకువెళ్లారు? కాన్పు చేసిందెవరు? చనిపోయిన బిడ్డను ఆమె ప్రసవించిందా? లేక భూమ్మీద పడిన తరువాత చనిపోయిందా? ఊపిరి అందించక ఆ బిడ్డను చంపేశారా? ఇంతకీ ప్రసవించిన తల్లి ఇష్ట ప్రకారమే పసికందును విసిరివేశారా? ఈ ప్రశ్నలన్నింటీ సమాధానం రప్పించటానికి పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మరి కొన్ని గంటల్లో .. ఈ మిస్టరీని చేధించటానికి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారని సమాచారం.

Related posts

రూపాయి బలహీనపడటం లేదు.. డాలర్ బలపడుతున్నది…

Satyam NEWS

ల‌డిల‌డి అనే ప్రైవేట్ సాంగ్ తో విశేషాద‌ర‌ణ పొందుతున్న రోహిత్ నంద‌న్

Satyam NEWS

సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment