31.2 C
Hyderabad
June 20, 2024 22: 07 PM
Slider తెలంగాణ

పైకే గులాబి పువ్వు – లోన గుచ్చుకునే ముల్లు

jupally beerm

అది అసెంబ్లీ ఎన్నికల కాలం. ఇద్దరు నాయకులు హోరా హోరీగా పోరాడుకున్నారు. ఒకరి నొకరు తిట్టుకున్నారు. కొట్టుకున్నంత పని చేశారు. ప్రజలు ఓట్లేశారు. అందులో ఒకరు గెలిచారు. ప్రజాస్వామ్యంలో ఇది సహజం అనుకున్నారు. గెలిచిన వ్యక్తి పార్టీ అధికారంలోకి రాలేదు. ఓడిన వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చింది….. ఎంత సేపు చెప్పాలి ఈ కథ… అందుకే కొల్లాపూర్ లో కొత్త కథ మొదలైంది. కొల్లాపూర్ అనగానే ఆ ఇద్దరూ ఎవరో అర్ధం అయిపోయింది కదా. ఎంఎల్ఏగా గెలిచిన వ్యక్తి బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఓడిన వ్యక్తి జూపల్లి కృష్ణారావు. పాపం కృష్ణారావు ఎన్నికల్లో ఓడినందుకు కూడా బాధపడలేదు. పైన కేసీఆర్ ఉన్నాడు కదా చూసుకుంటాడులే అనుకున్నాడు. అకస్మాత్ముగా కాంగ్రెస్ లో గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ ఫిరాయించేశాడు. గులాబి కండువా కప్పేసుకున్నాడు. మరి నా పరిస్థితి ఏమిటి అని జూపల్లి అనుకుంటుంటే నువ్వు నా ఇంటి మనిషివి నీకు ఇబ్బందేమిటి అన్నారు. సరేలే అనుకున్నాడు కానీ చాలా మంది గెలిచిన వ్యక్తివైపే ఉండటంతో పాపం తన గొప్ప తానే చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు జూపల్లి. టిఆర్ఎస్ 1 ప్రభుత్వంలో  గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు 20 కోట్ల బడ్జెట్ ను కొల్లాపూర్  పురపాలక అభివృద్ధికి మంజూరు చేశారు.దీనికి ఆధారాలు ఉన్నాయి. స్మశాన వాటిక,  అండర్ డ్రైనేజీ, కుల సంఘాల భవనాల, అదేవిధంగా  ఆడిటోరియం, ప్రెస్ క్లబ్, అంబేద్కర్ కళా భవన్, ఓపెన్ జిమ్, షాదీఖానా ఇతర  అభివృద్ధి పనులకు 20 కోట్ల  రూపాయలు మంజూరయ్యాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో ఎన్నికలు రావడంతో శంకుస్థాపన వరకే  పరిమితమయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు మాజీ మాజీ మంత్రిగా అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి  ఎమ్మెల్యే అయ్యారు. తదనంతరం మారిన రాష్ట్ర  రాజకీయాల పరిణామాల్లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి  ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే పార్టీలో వుండే సరికి రెండు గ్రూప్ ల రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ పేరు లేకుండా వ్యక్తులతో ఇక్కడ రాజకీయం నడుస్తున్నది. తెలంగాణ మొత్తం ఒక్క టిఆర్ఎస్ తప్ప వేరే పార్టీ లేదు కదా అందుకే వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పుడు పురపాలక అభివృద్ధికి విడుదలైన 20 కోట్ల బడ్జెట్ తో సిసి రోడ్లు నిర్మాణం చేస్తున్నారు.నిర్మాణం చేసేది ఎమ్మెల్యేనే అని ఆ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కాదు ఇది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు విడుదల అయినవని జుపల్లి వర్గం చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు జరిగే సిసి రోడ్లపనులు అదేవిధంగా కూరగాయల మార్కెట్, సిసి రోడ్లు, కల్యాణ మండపం  ఇదివరకు శంకుస్థాపన చేసినవే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి.పురపాలక అభివృద్ధి పనులు జూపల్లి కృషి ఫలితమేనని చెప్పవచ్చు.అయితే ఇంతవరకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తానే అభివృద్ధి చేశానని నిధులు మంజూరు చేశానని చెప్పలేదు. అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు పైకి. కేవలం చుట్టూ వున్న అనుచరవర్గం,అక్కడ ఇక్కడ చందాలు వసూలు చేశే వారే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నార అంటున్నారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ లోకి వచ్చాక పురపాలక అభివృద్ధికి 10 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేయించడానికి కృషి చేశారని చెప్పవచ్చు.

Related posts

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వైసీపీ నేతల అభినందనలు

Satyam NEWS

నా చావుకి ఎస్ఐ నే కారణం

Murali Krishna

ఈ ఒక్కరోజే తెలంగాణలో 10 కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment