35.2 C
Hyderabad
April 20, 2024 16: 50 PM
Slider మహబూబ్ నగర్

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

#kalwakurthy

బాలికల ఉన్నత పాఠశాలలో  అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం బేటి బచావో బేటి పడావో 2022 అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబాలుర కంటే బాలికలు ఏ విషయంలో తీసుపోరని ప్రస్తుత కాలంలో బాలుర కంటే బాలికలే ఉన్నత ఉద్యోగాలు ఉత్తీర్ణత శాతం   అన్ని రంగాలలో ముందున్నారని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు విద్య పోషణ చట్టపరమైన హక్కులు వైద్య సంరక్షణ రక్షణ హింస బలవంతపు బాల్య వివాహం పై అవగాహన పెంచారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించే ఆనవాయితీ వస్తుందన్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చిందని తెలిపారు.

మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్నారు. అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడిందని ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న  వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నిర్మల మధుబాబు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ములుగు జిల్లాలో బాలల రక్షణ వారోత్సవాలు

Satyam NEWS

స్థానిక ఎన్నికలపై జనసేనాని సంచలన నిర్ణయం

Satyam NEWS

వృత్తి దారులను మోసగిస్తున్న కెసిఆర్

Bhavani

Leave a Comment