37.2 C
Hyderabad
April 19, 2024 14: 37 PM
Slider విజయనగరం

శారీరక, మానసిక ప్రశాంతతకు యోగ ప్రధాన సాధనం

#rajakumariIPS

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా తరగతుల్లో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఆరోగ్యం పొందేందుకు కుటుంబ సభ్యులతో యోగా చెయ్యండి అని దేశ ప్రధాని మోడీ  పిలుపు మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగు అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్ లైన్ యోగా తరగతుల్లో పోలీసు శాఖ పాల్గొన్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

కరోనా నియంత్రణలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగా ఒక మంచి సాధనమన్నారు. ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వలన మానసిక ప్రశాంతతను పొందవచ్చునన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అతి ముఖ్యమైన సంపదల్లో యోగా సాధన ఒకటి అన్నారు. యోగాను పురాతన కాలంలోనే మన భారతీయులు సాధన చేసి, దాని విశిష్టతను ప్రపంచానికి తెలియజేసారన్నారు.

యోగా సాధన వలన మానసిక, శారీరక, ఆత్మల సమన్వయం సాధించవచ్చునన్నారు. శారీరక, నేడు యోగా ప్రాసత్యాన్ని యావత్తు ప్రపంచం గుర్తించిందన్నారు. అనేకమైన మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేసేందుకు యోగాను మించిన చికిత్స ఏమీ లేదన్నారు.

దేశ ప్రధాని మోడీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొని వచ్చారని, యోగా గొప్పదనాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతీ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకొంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజూ 30 నిమషాలు సమయమైనా యోగ సాధన చెయ్యాలన్నారు.

యోగ సాధన వలన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో పాటు, డయాబిటిస్, బ్లడ్ ప్రెజర్ మరియు ఇతర వ్యాధులు కూడా నయం అవుతాయన్నారు. మానసిక ఒత్తిడిని, ఉద్యోగ ఒత్తిడిని తట్టుకొనేందుకు పోలీసుసిబ్బంది, అధికారులు తప్పనిసరిగా ప్రతీ రోజూ యోగా సాధనను విధిగా చెయ్యాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పిలుపునిచ్చారు.

అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు అరుణ కుమారి మాట్లాడుతూ – కరోనా కారణంగా యోగా తరగతులను ఆర్ట్ ఆఫ్ లివింగు ఆధ్వర్యంలో ఆన్ లైను తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆన్లైను తరగతుల్లో సుమారు 300 మంది పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, యువతీ, యువకులు కూడా ఆన్ లైను యోగా తరగతులకు హాజరయ్యారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు అరుణ కుమారి తెలిపారు.

Related posts

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Sub Editor

కవితను మళ్లీ విచారించనున్న ఈడీ అధికారులు

Satyam NEWS

భావ కవితలకు హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment