37.2 C
Hyderabad
March 29, 2024 17: 25 PM
Slider ప్రత్యేకం

యోగాతో ఆరోగ్యం.. ఆనందం

#International Yoga Day 1

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ఒకప్పుడు భారతదేశానికి మాత్రమే పరిమితమైన యోగ చాలాకాలం నుంచే ప్రపంచానికి పరిచయం అయ్యింది.  భారతీయులతో పాటు ఇప్పుడు అన్ని దేశాల ప్రజలు యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని, ఆయుష్షును సైతం పెంచుకుంటున్నారు.

వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో పురుడుపోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను ఇప్పుడు యావత్ ప్రపంచం అనుసరిస్తుంది. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి కూడా యోగకు ఒక ప్రత్యేక రోజు ఉండాలని నిశ్ఛయించింది. అందులో భాగంగా ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది.

భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం

యోగకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  యోగకు ఆద్యుడు పతంజలి. మహా గ్రంథాలైన ఉపనిషత్తులు, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. నిత్యం యోగ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా వేధించే మొండి రోగాలు సైతం నయమవుతాయని చాలా సార్లు రుజువయ్యింది.

ఈ విషయం పరిశోధనల్లో సైతం తేలింది. భారతీయ సనాతన యోగ శాస్త్రానికి ఉన్న విలువను, దాని ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయ సమాజం 2014 సంవత్సరంలో అధికారికంగా గుర్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబరు 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదన చేశారు.

 యోగ ఒక్క భారతదేశానికే పరిమితం కాదని, ఈ భూమ్మీద ప్రతి మనిషికి యోగసనాలు అవసరమేనని మోదీ ఐక్యరాజ్య సమితిలో వివరించారు. ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

మన ప్రతిపాదనకు 177 దేశాల ఆమోదం

అదే ఏడాది డిసెంబర్ 11న మోదీ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ 193 సభ్య దేశాలకు గాను 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు.

2015 జూన్ 21న ఢిల్లీలోని రాజ్‌ పథ్‌ లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అదేరోజు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం మరో విశేషం. ఒకే వేదికపై సుమారు 36 వేలమంది యోగా చేశారు. అదేవిధంగా 84 దేశాల పౌరులు పాల్గొన్న ఏకైక ఈవెంట్ గా మొదటి యోగాడే జంట రికార్డులు సృష్టించింది.

అప్పటి నుంచి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యోగాడేను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రతీయేటా జూన్ 22నే యోగా డే నిర్వహించేందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. ఏడాదిలో ఉండే 365 రోజుల్లో జూన్ 21వ తేదీన ఉత్తర అకాంక్షంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.

యోగాను అభ్యసించండి ఆరోగ్యంగా ఉండండి

సూర్యుడు ఇదే రోజున ఉత్తరార్థ గోళం నుంచి దక్షిణార్థగోళానికి ప్రయాణించడం మొదలు పెడుతాడు. ఇక భారతీయ ఇతిహాసాలు శాస్త్రాల ప్రకారం.. ఆది గురువు శివుడు యోగా గురించిన విజ్ఞానాన్ని దేవతలకు చెప్పిన రోజుగా చెప్తారు. యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఈరోజు మంచిదని నమ్మకం. సూర్యుడి పగటి కాలం ఎక్కువగా ఉండే ఈరోజు ప్రకృతిలోని శక్తులన్నీ ఉత్తేజితమయ్యే రోజుగా చెబుతుంటారు.

ఇలా యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహించడం వెనుక అనేక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలుకూడా ఉన్నాయి.  ఇప్పటివరకు మీరు యోగపై దృష్టి పెట్టకపోతే ఇప్పుడే యోగను అభ్యసించడం ప్రారంభించండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి.

Related posts

చేతన ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్

Murali Krishna

అండర్ వేర్ లో బాంబు పేలి ఒకరి మృతి

Satyam NEWS

పుణ్య క్షేత్రం శ్రీ మైసమ్మ దేవత ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment