30.7 C
Hyderabad
April 24, 2024 02: 11 AM
Slider జాతీయం

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

jummu and kashmir

ఏడు నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కేంద్ర పాలిత ప్రాంతంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో లోయలో ఏడు నెలల సమాచార నిషేధం ఎత్తేసినట్లయింది. గత ఏడాది ఆగస్టు 4 న అన్ని ప్లాట్ ఫారాలకు ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసింది.

సోషల్ మీడియా సైట్లు, అప్లికేషన్లను యాక్సెస్ చేయడంపై నిషేధాన్ని బుధవారం అధికారులు రద్దు చేశారు. వీక్లీ రివ్యూ ప్రక్రియలో భాగంగా నేడు బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్ధరించారు. మొబైల్ ఇంటర్నెట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా ఫేస్ బుక్, పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్ వంటి వేలాది సైట్లను యాక్సెస్ చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. అయితే ఇంటర్నెట్ స్పీడ్, మొబైల్ డేటా సర్వీసు 2జీ వరకే పరిమితం అవుతుంది.

Related posts

కామారెడ్డిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో సంబరాలు

Satyam NEWS

భూ కబ్జాకు వత్తాసు పలికే తహసీల్దార్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

Satyam NEWS

తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Satyam NEWS

Leave a Comment