25.7 C
Hyderabad
June 22, 2024 06: 10 AM
Slider ముఖ్యంశాలు

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

#warangal police

దక్షిణ భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో తాళం వేసివున్న షట్టర్ తోలిగించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను శనివారం వరంగల్ సిసిఎస్, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుల నుండి సుమారు లక్ష 13వేల రూపాయలతో పాటు నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు: 1. జితేందర్ కుమార్ అలియాస్ మహావీర్, తండ్రి హన్మానరాంజీ, వయస్సు 23, నివానం పాద్రు, మండలం శివం, బడ్మిర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. 2. ఆకాన్ సింగ్, తండ్రి పేరు గణవత్ సింగ్, వయస్సు 19, నివానం చేన్పూర, బగోడ మండలం, జాలో జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. 3. విక్రం సింగ్, తండ్రి పేరు బన్వర్ సింగ్, వయస్సు 22, నివాసం విరాన, సాయల్ మండలం, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. 4. అర్జున్ సింగ్ తండ్రి పేరు గణవత్ సింగ్, వయస్సు 21, నివానం విరాన, సాయల్ మండలం, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.

ఈ అరెసుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్ళి అక్కడ వివిధ వ్యాపారాలకు సంబంధించిన షాపులు పనిచేస్తుండేవారు. నిందితులందరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో నిందితుల మధ్య స్నేహం కుదరటంతో నిందితులందరు కలిసి మద్యం సేవించడం,జల్సాలు చేసేవారు.

వీరికి వచ్చే అదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా నిందితుల్లోని జితేందర్ రెండు సంవత్సరాల క్రితం బెంగుళూర్లోని ఉల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షట్లర్ తాళం పగులగొట్టి చోరీ చేయగా, మరో నిందితుడు విక్రం సింగ్ సైతం నాలుగు సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక బుక్ స్టాల్ షటర్ తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన అనుభవం వుండటంతో నిందితులందరు మరోమారు షట్టర్ తాళాలు పగులగొట్టి చోరీలు చేసేందుకు సిద్ధపడ్డారు. దీనితో నిందితులు చెన్నై, కోయంబత్తూరు, బెంగూళూర్, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో షాపు షటర్ తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు.

నిందితులు ఈ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదిన వరంగల్‌కు చేరుకోని అదేరోజు రాత్రి జెపి ఎన్‌రోడ్డులోని ఓ ఎలక్ట్రికల్ షాపు షటర్ తాళం పగులగొట్టి షాపులో భద్రపర్చిన సూమారు 8లక్షల రూపాయలను చోరీ చేసారు.

ఈ చోరీపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా సూచనల మేరకు క్రైం ఎసిపి బాబురావు అధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, ప్రస్తుత ఇంతేజాగంజ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్, పూర్వ ఇంతేజా గంజ్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా సిసి కెమెరాల దృష్యాల ఆధారంతో పాటు ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని దర్యాప్తు బృందాలు నిందితుల కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. నిందితులు నలుగురు వరంగల్ బస్టాండ్ సమీపంలో వున్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు బృందాలు నిందితులను పట్టుకోని విచారించగా వారు పాల్పడిన నేరాలను అంగీకరించారు.

ఈ నలుగురు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా, ఎసిపి బాబురావు, సిసిఎస్ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్, ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ మల్లేష్ యాదవ్, ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు స్వామి, సంపత్ కుమార్, అసిస్టెంట్ ఆనాలటిక్ ఆఫీసర్ సల్మాన్‌షా, ఎ.ఎస్.ఐ శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహమ్మద్ ఆలీ, వేణుగోపాల్, నజీరుద్దీన్, ఇంతేజా గంజ్ కానిస్టేబుళ్ళు మీర్ మహమ్మద్ ఆలీ, శివకుమార్, శ్రీధర్ మరియయ ఐటీకోర్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related posts

విశ్వంభ‌ర పారంప‌ర్య ఆయుర్వేద‌ సేవా పుర‌స్కారం

Sub Editor

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి

Satyam NEWS

ములుగు జిల్లాలో బాలల రక్షణ వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment