38.2 C
Hyderabad
April 25, 2024 13: 36 PM
Slider సినిమా

ఆరేళ్ల సినీ కెరియర్ లో అన్నీ ఆణిముత్యాలే

darsana 45

దర్శనా రాజేంద్రన్ మలయాళ సినీ రంగంలో నటిగా అరంగేట్రం చేసి ఆరు సంవత్సరాలు అయింది.  ఈ కాలంలో ఆమె మరపురాని పాత్రలను పోషించింది. ముఖ్యంగా వైరస్, మాయనాది వంటి చిత్రాలలో దర్శన ప్రదర్శించిన నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఆరేళ్ల కెరియర్ పూర్తి సందర్భంగా దర్శన సత్యం న్యూస్ తో మాట్లాడుతూ మరో రెండు చిత్రాల నిర్మాణం పూర్తి కావచ్చిందని త్వరలో విడుదల అవుతాయని చెప్పింది. పెన్నం చెరుక్కనమ్, తురముఖం ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయని దర్శన విశ్వాసంతో ఉంది. త్వరలో హృదయమ్ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతున్నదని చెప్పింది.

ఇవన్నీ నటించే సమయంలో తనకే ఆసక్తి కలిగించాయని, ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందని దర్శన అంటున్నది. సినిమాల్లో చాలా వరకూ హీరో-హీరోయిన్ పైనే కథ కేంద్రీకృతమై ఉంటుందని అందువల్ల ప్రతి సారీ మంచి క్యారెక్టర్ రోల్స్ రావడం సాధ్యం కాకపోవచ్చునని అన్నారు. నేను థియేటర్ ఆర్ట్స్ నుండి వచ్చాను, కొన్నిసార్లు నేను ఐదు నిమిషాల సన్నివేశం కోసం వేదిక వేచి చూడాల్సి ఉంటుంది.

నాటకంలో నా పాత్ర నిడివి ఎంత ఉంది అనే దానికన్నా నా పాత్ర నేను సరిగా పోషించానా లేదా అనే దానిపైనే నా శ్రద్ధ ఉంటుంది అని దర్శన అంటున్నది. ముందుగా నేను ఫైనాన్స్‌ రంగంలో పని చేసేదాన్ని. అయితే అనుకోకుండా ధియేటర్ ఆర్ట్ లోకి వచ్చాను. అదే నా జీవితాన్ని మార్చేసింది అంటున్నది దర్శన.

ఇది నాకు ఉద్యోగంతో పాటు నా అభిరుచికి తగినట్టుగా ఉంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఉంది అని దర్శన చెప్పింది. అయితే నటన అనేది సులభం కాదు. నెల తిరిగే సరికి జీతం రాదు. కెరియర్ లో స్థిరత్వం లేదు. అయినా ఇది నేను ఇంతకు ముందు చేసిన పనికి భిన్నంగా ఉండటం వల్ల ఉత్సాహంగా ఉంది.

మలయాళ సినీ రంగంలో అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది  కానీ ఇప్పుడు అంతా ఆనందంగా ఉంది అని దర్శన అంటున్నది. చిన్న క్యారెక్టర్లతో చిత్ర రంగంలోకి వచ్చినా ఇప్పుడు ప్రధాన భూమికలు వేస్తున్న దర్శనకు సత్యం న్యూస్ ఆల్ ద బెస్ట్ చెబుతున్నది.

Related posts

బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు కుమ్ములాటలు

Satyam NEWS

చేతులకు తాళ్లు కట్టుకుని నారా భువనేశ్వరి నిరసన

Satyam NEWS

ఎల్ఐసి ప్రయివేటీకరణపై సిబ్బంది నిరసన ధర్నా

Satyam NEWS

Leave a Comment