36.2 C
Hyderabad
April 25, 2024 21: 38 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కార్మిక ఉద్యమం ఉధృతం

#INTUC Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ మండలం గోపాలపురం గ్రామంలో దడువాయి వర్కర్స్ యూనియన్ కార్మికుల సమావేశం నేడిక్కడ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న  INTUC నియెజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మికులకు వివరించి   జాతీయ కార్మిక సంఘాల నాయకుల పిలుపు మేరకు ఈనెల 26న, సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. 

కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం అన్నారు. కార్మిక చట్ట సవరణను అపాలని, కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తుందని తీవ్రంగా అరోపించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వ తన తీరు మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో షేక్ పారేసాయిబ్, రేమిడాల అంజి, షెక్ రహీమ్, అంబళ్ళ శ్రీను, షేక్ సైదా, వీరబాబు తదితర కార్మికులు పాల్గొన్నారు.

Related posts

బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలి

Bhavani

నియోజకవర్గ ప్రజలకు అండగా మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

అంతిమ తీర్పు ప‌త్రిక ఎడిట‌ర్ వ‌ల్లూరు ప్ర‌సాద్‌ కుమార్‌కు స‌త్కారం

Bhavani

Leave a Comment