28.7 C
Hyderabad
April 20, 2024 05: 56 AM
Slider నల్గొండ

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 77వ ఆవిర్భావ దినోత్సవం

#hujur

77వ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ ఎన్ టి యు సి) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో బుధవారం ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలలో భాగంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ ఐ ఎన్ టి యు సి జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ 1947   మే 3న,స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ,జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మేధావులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను (ఐ ఎన్ టి యు సి)నిర్మాణం చేశారని అన్నారు.కార్మిక సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి సమాంతరంగా నడుపుకుంటూ రావడమే ఐ ఎన్ టి యు సి ధ్యేయమని అన్నారు.

జాతీయ అధ్యక్షు డాక్టర్ జి. సంజీవరెడ్డి నేతృత్వంలో ఐ ఎన్ టి యు సి దేశంలోనే 34.95 మిలియన్ మందికి పైగా అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉందని అన్నారు. అనంతరం సీనియర్ కార్మికులు ఎన్ ఎస్ ఎల్ బి సి యూనియన్ నాయకులు ఆదే మురళి,సివిల్ సప్లయ్ హమాలి యూనియన్ అధ్యక్షుడు తోట లక్ష్మయ్య, ఎస్ డబ్ల్యూసి యూనియన్ నాయకులు తుమ్మల సైదులు,బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ నాయకులు జానయ్య ను శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,బాచిమంచి గిరిబాబు,కారింగుల వెంకన్న,కుక్కడపు మహేష్ గౌడ్, అంజనపల్లి సుదర్శన్,సయ్యద్ ముస్తఫా, బెంజిమెన్,రేడపంగు రాము,కందుల వెంకన్న,పెద్దబ్బాయి,గోపయ్య,సామేలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

మన పల్లెటూరు

Satyam NEWS

14 నుంచి కేసీఆర్‌ పోషక కిట్లు పంపిణీ

Bhavani

కరోనా సెకండ్ వేవ్.. అలసత్వం వద్దు

Sub Editor

Leave a Comment