39.2 C
Hyderabad
April 25, 2024 17: 54 PM
Slider నల్గొండ

ఘనంగా ఐ ఎన్ టి యు సి 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

#INTUC

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మంగళవారం ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య మాట్లాడుతూ గాంధీజీ శాంతియుత పోరాట పటిమ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పం,నెహ్రు ఫెబియన్ సామ్యవాద భావాలు,ఆలోచనలతో ఏర్పడిన  కార్మికుల శ్రమైక్య సంఘం ఐ ఎన్ టి యు సి నేడు లెజెండ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ డాక్టర్ జి.సంజీవరెడ్డి సారధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని అన్నారు.

ఆరోగ్య కరమైన ఆలోచనలు విజయానికి దారులు అన్న సామెతను ఐ ఎన్ టి యు సి ఋజువు చేస్తుందని, 75వ,వసంతాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పారిశ్రామిక శాంతి, కార్మిక సంక్షేమం అనే రెండు లక్ష్యాలతో కార్మిక సంఘ నాయకులందరూ కలిసి 1947 మే నెల 3న, కొత్త డిల్లీలో ఐ ఎన్ టి యు సి  స్థాపించారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐ ఎన్ టి యు సి బలంగా ఉంది అంటే జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ యరగాని నాగన్న గౌడ్ కృషి ఎంతో ఉందని అన్నారు. కార్మికుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి నిరంతరం పోరాటం చెస్తుందని అన్నారు .సమావేశ అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు.   

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మండల అద్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి,పట్టణ ప్రదాన కార్యదర్శి పోతనబోయిన రాంముర్తి,పార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అద్యక్షుడు సలిగంటి జానయ్య,

మహిళ నియేజకవర్గ అద్యక్షురాలు చప్పిడి సావిత్రి,నాయకులు మేకపోతుల వీరబాబు,కస్తాల రవీందర్,రెడపంగు రాము, తోట లక్మయ్య,పులిపాటి నాగరాజు,అమరబోయిన ప్రసాదు,  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అభివృద్ధిలో తెలంగాణ టాప్: మంత్రి కేటీఆర్

Bhavani

గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం

Satyam NEWS

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌!

Sub Editor

Leave a Comment