24.7 C
Hyderabad
March 29, 2024 06: 23 AM
Slider ప్రత్యేకం

రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పాటించాలి

#INTUC

సంయుక్త కిసాన్ మోర్చా(SKM) ఆధ్వర్యంలో INTUC తో పాటుగా 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు భారత ప్రజాస్వామ్యంలో 26 మే 2021 ని బ్లాక్ డే గా పాటించాలని నిర్ణయించాయని INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మంగళవారం నాగన్న గౌడ్ మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వాలు తెచ్చిన మూడు రైతు  చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ మహా నగరంలో గత 6 మాసాలుగా ఆందోళన నిర్వహిస్తున్నారని,మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచిందని,అధికారంలోకి రావడానికి ముందు భారత ప్రజలకు ఇచ్చిన హమీలన్నీ బుట్ట దాఖలయ్యాయని అన్నారు.

కరోనా విపత్తును కూడా ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోయిందని,కరోనాను సాకుగా చూపి రైతు వ్యతిరేక చట్టాలతో పాటు 4 కార్మికుల చట్టాల కోడ్లను సవరించిందని,ఈ చట్టాల సవరణ కార్పోరేట్ శక్తులకు,గుత్తేదార్లకు అనుకూలంగా సవరించిందని అన్నారు.

బొగ్గు గనులను ప్రయివేటీకరణ,పేరుతో అదానీ,అప్పగించిందని, ఆరు ఎయిర్ పోర్టును ప్రయివేటుకు అప్పగించారని, రక్షణ, రైల్వే, బ్యాంకుల ప్రైవేటీకరణకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వనించిందని,అసంఘటిత కార్మికులకు, వలస కూలీలకు కనీస ఆహార సదుపాయాలతో పాటు ఉద్యోగత లేక అవస్ధలు పడుతున్నారని,పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పధకం అమలును నిలిపివేసిందని,కరోనాను ఎదుర్కొవడానికి ఖర్చు పెట్టని ప్రభుత్వం సెంట్రల్ విస్టా పేరుతో నూతన పార్లమెంట్ భవనానికి 20000 వేల కోట్లు ఖర్చు పెడుతుందని విమర్శించారు.

రాజ్యాంగ బద్ధ సంస్థలను అన్నింటిని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు.            

ప్రధాన డిమాండ్లు           

1.అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తేవాలి.

2.ప్రభుత్వ వైద్యాన్ని అన్ని స్థాయిల వారికి అందేటట్లు చూడాలి.                              

3.అసంఘటిత కార్మికులకు ఉచిత బియ్యం ,సరుకులతో పాటు నెలకు 7500 రూపాయలు వెంటనే ఇవ్వాలి.                               4.మూడు రైతు వ్యతిరేక చట్టాలను,విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి.        

5.సవరించిన 4 కార్మిక లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలి.

6.బిజెపి పాలిత రాష్ట్రలలో 36 కార్మిక చట్టాలను 3 సంవత్సరాలలో తొలగించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి.

INTUC తో పాటుగా 10 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ 2021 మే 26న,బ్లాక్ డే గా పాటించాలని కోరారు.

Related posts

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

120 కోట్లతో 2వేల ఇళ్ళు

Satyam NEWS

శివసేన ఎన్నికల గుర్తుపై నిషేధం: ఇరువర్గాలకు వేర్వేరు గుర్తులు

Satyam NEWS

Leave a Comment