వసంత పంచమి( శ్రీ పంచమి) ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయానికి విచ్చేసి పట్టు వస్త్రములను సమర్పించాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకిరణ్ రెడ్డిని ఆలయ కమిటీ కోరింది. ఆలయ ఇవో వినోద్ రెడ్డి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ, నంద కిషోర్ మంత్రిని ఆహ్వానించిన వారిలో ఉన్నారు.
దేవస్థానంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు నిర్వహిస్తున్న విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలిసిందే. వేద పండితులు ఆలయ కమిటీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని కలసి ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం ఆలయ పూజారులు మంత్రిని శాలువతో సన్మానించి ప్రసాదం అందించి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జ్ పర్యవేక్షకులు సంజీవ్ రావ్, సీనియర్ అసిస్టెంట్ శైలేష్, ఆలయ pro గోపాల్ సింగ్ ఉన్నారు.