39.2 C
Hyderabad
April 25, 2024 17: 21 PM
Slider జాతీయం

టెర్రరిస్టులకు సమాచారం అందించిన ఐపీఎస్ అధికారి అరెస్టు

#NIA

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్టు చేసింది. 2017లో హురియత్ టెర్రర్ ఫండింగ్ కేసు దర్యాప్తు చేసినందుకు ప్రతిభా పురస్కారం అందుకున్న అరవింద్ దిగ్విజయ్ నేగీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడం, అమలు చేయడంలో సహకరిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ఈ ఐపిఎస్ అధికారి కీలక సమాచారం అందించేవాడు. NIAలో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేసిన నేగీ ఆ తర్వాత సిమ్లాలో పోస్టింగ్ పొందాడు. ఒక సంవత్సరం పాటు ఎన్ఐఏ నేగీపై నిఘా వేసింది. ఎన్ఐఏ అతని ఇళ్లలో సోదాలు చేసింది. ఈ కేసులో ఎల్‌ఈటీకి చెందిన ఓజీడబ్ల్యూగా ఉన్న మరో నిందితుడికి ఎన్‌ఐఏ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేసినట్లు కూడా తేలింది. నేగి హిమాచల్ ప్రదేశ్ పోలీస్ సర్వీస్ అధికారి కాగా, 2011లో IPS స్థాయికి పదోన్నతి పొందారు. అతను NIAలో 11 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. టెర్రర్ ఫండింగ్, ఫేక్ కరెన్సీ (TFFC) విభాగంలో సమర్ధవంతంగా పని చేశాడు. మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌కు నేగీ సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కీలకమైన సమాచారం ఇచ్చినందుకు నేగీ డబ్బులు కూడా తీసుకున్నాడు.

Related posts

వై యస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయండి

Satyam NEWS

తిరుమ‌ల‌ నిఘా, భ‌ద్ర‌తా విభాగంలో ఆయుధ‌పూజ‌

Satyam NEWS

సి ఎం ఆర్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Satyam NEWS

Leave a Comment