28.7 C
Hyderabad
April 20, 2024 08: 44 AM
Slider ముఖ్యంశాలు

ఏపిలో మ‌రో 13 మంది ఐపీఎస్ లు బ‌దిలీ…!

#IPS officers

ముందుగా వార్త‌ల‌ను ప‌సిగట్ట‌డంలో  ఎప్ప‌టిక‌ప్పుడు తాజా వార్త‌ల‌ను అందిస్తున్న స‌త్యం న్యూస్.నెట్ చెప్పిన‌ట్టుగానే అయిద‌వ బెటాలియ‌న్ క‌మాండంట్ గా విక్రంత్ పాఠిల్ రానున్నారు..ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మ‌రోసారి 13 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేసింది.

వీరంద‌రినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ అవ్వాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.కాగా  ఈ నెల 12 వ  తేదీన విక్రంత్ పాఠిల్ భార్య దీపికా పాఠిల్  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా బాద్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  అంత‌కుమందు ఎస్పీ గా ప‌ని చేసిన రాజ‌కుమారీకి డీఐజీగా ప‌దోన్న‌తి రావ‌డంతో ఆమెకు బ‌దిలీ త‌ప్ప‌ద‌ని ఆ స్థానంలో దీపికాపాఠిల్,ఆమె భ‌ర్త  విక్రాంత్ పాఠిల్ 5 వ‌   బెటాలియ‌న్ క‌మాండెంట్ గా  వ‌స్తార‌ని ముందుగానే స‌త్యం న్యూస్.నెట్ వార్త ఇచ్చింది కూడ‌.

గ‌త వారమే 16 ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా…మరో 13 మందిని బ‌దిలీ చేసింది.తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కామెందెంట్ గా విక్రంత్ పాటిల్ ,ప్రకాశం జిల్లా ఎస్పీ గా మాలికా గర్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ , మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల , కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జి ఎస్ సునీల్ , విశాఖ డీసీపీ వన్ గా గౌతమి సలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా  జిందాల్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్  ఎస్పీ గా షిముని,ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీ గా కోయ ప్రవీణ్,  డీజీపీ ఆఫీస్ లో అర్ ఎం గా అమ్మిరెడ్డి  బ‌దిలీ చేసింది…జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఈమేర‌కు వీరినంద‌రినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు  అందాయి.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్ కొనేస్తుందని ఓట్లు వేయలేదు

Satyam NEWS

శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆర్జితసేవలు రద్దు

Satyam NEWS

Leave a Comment