35.2 C
Hyderabad
April 20, 2024 18: 22 PM
Slider ప్రపంచం

డీప్ ట్రబుల్: పెరుగుతున్నఅమెరికా ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు

iran america warnings

పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరోసారిపెరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాక్యాలు ఆ రెండు దేశాల మధ్య అగాదం పెంచనున్నాయి. అమెరికన్లపై,వారి ఆస్తులపై దాడులు చేస్తే పరిణామాలు ఉంటాయని ,బదులుగా చాలా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని, ఆ దేశ ప్రజలు చాలా కష్టాలను అనుభవిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమైనీ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని వదిలేసి ఇరాన్ ను గొప్ప దేశంగా మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరోవైపు ఖమైనీ కూడా అమెరికాపై విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉన్నామంటూ అమెరికా అసత్య ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఇరాన్ ప్రజలతో కలిసి ఉన్నావారి ప్రజల్లో విషపు కత్తులను దింపేందుకు అమెరికా యత్నిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా తమపై ఆంక్షలు విధిస్తున్నా… వాటిని తట్టుకుని నిలబడ్డామని చెప్పారు.తాము కూడా ఎంతకైనా తెగాయిస్తామని దేనికి భయపడమని దాడులకు ప్రతి దాడులు తప్పవని ట్రంప్ ను హెచ్చరించడం గమనార్హం.

Related posts

ఉపాధ్యాయుల ఆందోళనపై ఉక్కుపాదం

Satyam NEWS

ఏపిలో పెరిగిపోతున్న రాజ్య హింస

Satyam NEWS

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం… వైసీపీకి షాక్

Satyam NEWS

Leave a Comment