ఇరాక్ భూభాగంలో మరోసారి రాకెట్ దాడి జరిగింది. గురువారం రాత్రి కిర్కుక్ ప్రావిన్స్‌లో గల శిబిరంపై దాడి చేశారు. రాకెట్ దాడిని అమెరికా, ఇరాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నాయి. దాడి చేసింది ఎవరనే అంశాన్ని మాత్రం ధృవీకరించలేదు.డిసెంబర్ 27 తర్వాత మళ్లీ ఇక్కడ రాకెట్లతో దాడులు చేయడం ఇదే మొదటిసారి .కాగా దాడులు చేసింది ఇరాన్ లేకా మరె దేశమా అని అమెరికా విచారణ జరుపుతుంది.ఇరాన్ మాత్రం తన ప్రతీకార ధోరణి వీడనాడడం లేదు.