39.2 C
Hyderabad
March 28, 2024 14: 51 PM
Slider ప్రపంచం

అణు పితామ‌హుడు దారుణ హ‌త్య‌

moshean

ఇరాన్‌కు చెందిన ప్ర‌ముఖ అణుశాస్ర్త‌వేత్త మోషెన్ ఫ‌క్రిజాదే హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య పాపం ఇజ్రాయిల్‌దేన‌ని ఇరాన్ ఆరోపిస్తోంది. టెహ్రాన్ న‌గ‌ర శివారు అబ్‌సార్డ్ వ‌ద్ద ఆయ‌న ప్ర‌యాణిస్తున్నవాహ‌నం ముందు తొలుత‌గా పేలుడు ప‌దార్థాల‌తో దాడి చేసిన‌ట్లు అనంత‌రం ఓ కారులో వ‌చ్చిన ఆరుగురు ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. కాగా తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఫ‌క్రిజాదేను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆయ‌న ప్రాణాలు విడిచిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. మోషెన్ ఫ‌క్రిజాదేను ప‌లువురు దేశాధ్య‌క్షులు అణు పితామ‌హుడుగా కూడా పేర్కొంటారు.

ఈ నేప‌థ్యంలో మ‌రోమారు ఇరాన్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంపై ఇరాన్ ఇప్ప‌టికే ఐక్య‌రాజ్య‌స‌మితికి ఫిర్యాదు చేసింది. ఇజ్రాయిల్ త‌మ శాస్ర్త‌వేత్త‌ల‌ను ఒక్క‌క్క‌రూగా హ‌త‌మారుస్తోంద‌ని ఆరోపించింది. ఇరు దేశాల్లో ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొనే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇజ్రాయిల్ కావాల‌నే శాంతియుత వాతావ‌ర‌ణాన్ని వీడి యుద్ధ వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌రుస్తుంద‌ని ఇరాన్ ఆరోపించింది.

కాగా మోషెన్‌ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ప్ర‌భుత్వం ఘాటుగా వెల్ల‌డించింది. కాగా అణు శాస్త్ర‌వేత్త ఫ‌క్రిజాదే హ‌త్య‌పై ఇంత వ‌ర‌కు ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం విశేషం.

Related posts

పల్లె నిద్ర చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి

Satyam NEWS

వి ఎస్ యూ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Bhavani

విద్యా కానుక కాదు..విద్యార్థులకు దగా కానుక….

Satyam NEWS

Leave a Comment