36.2 C
Hyderabad
April 18, 2024 14: 09 PM
Slider ముఖ్యంశాలు

నగరిలో నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.100 కోట్లు

#MLA Roja

చిత్తూరు జిల్లా నగరి లో నీటిపారుదల ప్రాజెక్టులను తక్షణమే చేపట్టేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు.

నేడు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆర్ధిక మంత్రితో సమావేశం అయ్యారు. విజయపురం మండలం బుగ్గ అనకట్ కింద మంగళం సప్లై ఛానల్ పనులు తక్షణమే చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే రోజా ఆర్ధిక మంత్రికి వివరించారు.

అదే విధంగా 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నగిరి మండలం లోని  మొక్కలు కండ్రిగ గ్రామం వద్ద కుశస్థలి నది దగ్గర నిర్మించనున్న నూతన ట్యాంక్ విషయాన్ని కూడా ఆర్ధిక మంత్రి దృష్టికి ఎమ్మెల్యే రోజా తీసుకువెళ్లారు.

ఎస్టిమేషన్ పూర్తి అయినందున  అతి త్వరలో నిధులు విడుదల చేస్తే నగరి లో ఇరిగేషన్ సమస్యలు కొంచెం తిరుతాయని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఆర్ధిక మంత్రి వీలైనంత త్వరగా నిధుల కు అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు.

నగిరి నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న పలు కాంట్రాక్టు బిల్లులు త్వరగా చెల్లిస్తే మరికొంత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా కోరగా నిధుల లభ్యతను బట్టి విడతలవారీగా పెండింగ్ కాంట్రాక్ట్ బిల్స్ చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు

Satyam NEWS

మారు మూల పల్లెలకు చేరుతున్న చిరంజీవి ఆక్సిజన్

Satyam NEWS

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలానికి నిర్ణయం

Sub Editor

Leave a Comment