39.2 C
Hyderabad
April 25, 2024 18: 56 PM
Slider వరంగల్

మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తికి IRS క్యాడర్

#pune police

మారుమూల జిల్లా లోని మారుమూల గ్రామానికి చెందిన ఒక అధికారి IRS క్యాడర్ కు ఎంపిక అయితే ఎలా ఉంటుంది? ఎలావుంటుంది? ఆ వూరు మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామం లో ఇదే జరిగింది. ఆ గ్రామానికి చెందిన పోరిక పర్తి 1989లో ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయన IRS క్యాడర్ కు ఎంపిక అయ్యారు. పదోన్నతి పొంది అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ లో నియమితులయ్యారు. మహారాష్ట్రలోని పూనే లో నేడు ఆయన పదవీ స్వీకారం చేశారు. మదనపల్లి గ్రామంలో IRS క్యాడర్ వచ్చిన మొదటి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. గ్రామంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన వంతు సాయంగా నేనున్నానంటూ ఆయన ముందుకు వచ్చేవారు. ప్రతి ఒక్కరికి  తనవంతు సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి కి ఆ దేవుడి దయ వల్ల ఇలాంటి పదోన్నతులు మరెన్నో రావాలని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పదోన్నతి పొందిన సందర్భంగా పోరిక పర్తి ని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.

Related posts

ప్రజలిచ్చిన ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

రైస్ మిల్ డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచాలి

Satyam NEWS

రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం: క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment