36.2 C
Hyderabad
April 16, 2024 22: 28 PM
Slider ప్రత్యేకం

మాయావతి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్?

#RSPraveenkumar

కాన్షీరాం ఆదర్శాలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడతాయని స్థిరంగా భావిస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మాయావతి నేతృత్వంలోని బిఎస్పి తెలంగాణ రాష్ట్రంలో తన పట్టుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. గతంలో కూడా బీఎస్పీ నుండి తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం గమనార్హం. పార్టీ టికెట్ రాకపోవడంతో ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ఇద్దరు బీఎస్పీ నుండే టికెట్ సాధించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు.

అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. స్వయంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రవీణ్ కుమార్ తమ పార్టీలో చేరితే బాగుంటుందని సూచిస్తున్నట్లు తెలిసింది. ఆయనను తెలంగాణ బీఎస్పీ అధ్యక్షునిగా చేయనున్నట్లు రాజీనామా చేసినప్పటి నుండి ప్రవీణ్ కుమార్ మద్దతుదారులతో చెబుతూనే ఉన్నారు.

మాయావతి ప్రకటన తర్వాత ఆయన కూడా బిఎస్పీలో చేరడం పై ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపికి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందుగా తాను రాజకీయాల్లో రానన ప్రకటించిన ప్రవీణ్ కుమార్  బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని వెల్లడించారు.

ఆయా వర్గాల అభ్యున్నతికోసం కృషి చూస్తుంటానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక రాజకీయ వేదిక కోసం బిఎస్పీని ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. హుజురాబాద్ ఉపఎన్నికలలో తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలను కొట్టిపారవేస్తూ, తనను రెచ్చగొడితే నిజంగానే పోటీ చేస్తానని అంటూ తాజాగా బెదిరిస్తున్నారు.

ఇప్పుడేమో బీఎస్పీ తరపున బలమైన అభ్యర్థి దొరికితే పోటీ చేయిస్తాననే సంకేతం ఇస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళితుల ఓటర్లు ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపకుండా చేయడం కోసం, తమ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రతిపక్షాలను బలహీనం చేసే ఎత్తుగడలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

Related posts

ఘ‌నంగా ప్రారంభ‌మైన వ‌ర్గో పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 `సెహ‌రి`

Satyam NEWS

బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

Satyam NEWS

వార్నింగ్:అంతర్గత వ్యవహారాల్లో టర్కీ జోక్యం తగదు

Satyam NEWS

Leave a Comment