33.2 C
Hyderabad
April 26, 2024 02: 51 AM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి యూనివర్సిటీకి ఐఎస్ఓ ప్రమాణాలు

#VikramSimhapuriUniversity

ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ఐ.ఎస్.ఓ.9001-2015  ధ్రువపత్రానికి సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ ద్విసభ్య అధ్యయన కమిటీ నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. 

ద్విసభ్య కమిటీ చైర్మన్ ఆలపాటి  శివయ్య అధ్యక్షతన విశ్వవిద్యాలయం లోని  వివిధ విభాగాలను సందర్శించి అక్కడ పొందుపరచిన  దస్త్రాలను, అధ్యాపకులు సాధించిన విజయాలను విద్యార్థుల కార్యకలాపాలను, పరిశోధన మౌలిక సదుపాయాలను  పరిశీలించి   సూచనలను చేశారు.

పరిపాలన విభాగాలు అనుసరిస్తున్న పద్ధతులు, దస్తావేజుల నిర్వహణ వంటి వాటి మీద విపులముగా చర్చించి వారు తీసుకోవలసిన కొన్ని ప్రామాణిక బద్దంగా చేయవలసిన పద్దతులను తెలిపారు.

NSS  విభాగం చేస్తున్న , చేపట్టిన కార్యకలాపాలను తెలుసుకున్న తెలుసుకున్న ఆయన, NSS విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఐ.ఎస్.ఓ.  9001-2015 ధ్రువ పత్రం వలన విద్యాలయ విద్యాప్రమాణాలు అంతర్జాతీయ స్థాయి లో మంచి గుర్తింపు వస్తుందని అలాగే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనా సంస్థలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకొనటం అనువుగా ఉంటుంది.

ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన  మాట్లాడుతూ ఐ. ఎస్.  ఓ.  9001-2015 గుర్తింపు వున్న విశ్వవిద్యాలయాలకు నాక్ గుర్తింపు రావటం సులువు అవుతుందని తెలిపారు.

అంతకుముందు  ఐ. ఎస్.  ఓ.  9001-2015 ధృవీకరణకు సంబందించిన విశ్వవిద్యాలయ సమన్వయ కర్త డా. సి. కిరణ్మయి విశ్వవిద్యాలయ పూర్తి వివరాలను  ను మరియు విశ్వవిద్యాలయ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ ఐ. ఎస్.  ఓ.  9001-2015 ధృవీకరణ పర్యవేక్షణ ప్రక్రియలో రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య, రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి, ఆచార్య అందే ప్రసాద్ ద్విసభ్య కమిటీ సభ్యురాలు సునీత, ఇతర ఉన్నతాధికారులు, అధ్యాపకులు  పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్ట్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

Satyam NEWS

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Bhavani

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ నిర్మల్ బిజెపి

Satyam NEWS

Leave a Comment