39.2 C
Hyderabad
March 28, 2024 16: 55 PM
Slider జాతీయం

భారత స్పేస్ పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం

భారత స్పేస్ సెక్టార్‌ను కొత్త పుంతలు తొక్కించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ప్రఖ్యాత స్పేస్ మిషన్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సవాల్ విసిరింది. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, కొత్త టెక్నాలజీపై సంస్థ శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో స్పేస్ సెక్టార్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అడుగులు వేసింది.

ఈ క్రమంలో ఇస్రో తాజాగా రెండు స్టార్టప్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు ఇస్రో అవసరాలకు అనుగుణంగా కొత్త తరం రాకెట్లను తయారు చేసి అందించనున్నాయి. పీపీపీ పద్ధతిని ప్రకటించిన నెలలోనే ఇస్రోకు ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్ నుంచి 27 ప్రపోజల్స్ వచ్చాయి. దాంట్లో స్కైరూట్, అగ్నికుల్ అనే ప్రైవేట్ సెక్టార్ కంపెనీలతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కంపెనీలు ఇస్రో కోసం రాకెట్స్, లాంచింగ్ వెహికల్స్ తయారు చేస్తాయి. అత్యాధునికమైన స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుందని ఇస్రో చీఫ్ కే శివన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఎకానమీ విలువ సుమారు 360 బిలియన్ డాలర్లు కాగా.. దాంట్లో భారత్ వాటా 2 శాతం మాత్రమే.

ఇండియన్ స్పేస్ సెక్టార్ రాబోయే ఐదేళ్లలో కనీసం 50 బిలియన్ డాలర్లకు చేరుకోవాలన్నా.. 48 శాతం కాంపౌండ్ అగ్రెగేట్ గ్రోత్ రేట్ ఉండాల్సిందే. దాని కోసం.. ఇస్రో ఇంకా ఎన్నో గొప్ప రాకెట్లను ప్రయోగించాల్సి ఉంది. అంతరిక్షానికి సంబంధించి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించాలని, దానికి ప్రైవేటు సంస్థల సహకారం అవసరమని, అందుకే తాజా ఒప్పందం చేసుకున్నామని ఇస్రో ప్రకటించింది.

Related posts

మీ కోసం పోలీస్: ఆదివాసులు విద్యావంతులు కావాలి

Satyam NEWS

ఇష్టానుసారంగా ఈ- చలానా విధిస్తున్న పోలీసులు

Satyam NEWS

నో ఎస్సెన్స్: ఇది చాలా నిర్లిప్తమైన బడ్జెట్

Satyam NEWS

Leave a Comment