ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది అని మాజీ రాష్ట్ర రోడ్డు భవనా ల అభివృద్ధి డైరెక్టర్ (APRDC) రాష్ట్ర డైరెక్టర్ జి గుల్జార్ భాష తెలియజేశారు. రాజంపేటలో ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో కేంద్ర ప్రభుత్వము ద్వారా 15 వేల కోట్ల రూపాయల నిధులు సాధించడం ఒక్క చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు భాగస్వామి అయిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా దూరపు చూపుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసి, చాణిక్య నీతిని ఉపయోగించి కూటమి ప్రభుత్వముతో జతకట్టి,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఒప్పించి పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు సాధించి,ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జయహో చంద్రన్న అని నినాదాలు చేస్తున్నారన్నారు .విభజన తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వము ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం పై ఆయన హర్షo వ్యక్తం చేశారు… గత జగన్ ప్రభుత్వములో ఐదు సంవత్సరాలు ఎలాంటి నిధులు రాబట్ట లేక ముఖ్యమంత్రిగా జగన్ మీద మచ్చ ఏర్పడిందన్నారు. జగన్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోడీతో తన క్రిమినల్ కేసుల గురించి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు చేసేవారని అన్నారు.ఈ బడ్జెట్ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ దేశములోనే మొదటి స్థానంలో ఉందనీ, కేంద్ర ప్రభుత్వము మరియు కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడం చాలా ఆనందం కలిగిందన్నారు.
previous post