33.2 C
Hyderabad
April 26, 2024 01: 35 AM
Slider ముఖ్యంశాలు

ఉపాధి నిధులను వెనక్కి పంపమనడం సిగ్గుచేటు

#Baswaraju Saraiya

రైతులు పంటపొలాల్లో కళ్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామి నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపమనడం సిగ్గుచేటని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి ఈ రంగంలో లభించిన ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.

ఏపి, తమిళనాడు, కర్నాటక, ఓరిస్సా రాష్ర్టాలలో ఉపాధి హామి పథకంలో భాగంగా కళ్లాల నిర్మాణం జరుగుతుందని కానీ తెలంగాణలో కళ్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 60 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని హామి ఇచ్చి మోసం చేసింది ఎన్డీఏ ప్రభుత్వమని అన్నారు. లక్ష కోట్లతో వ్యవసాయానికి మౌళిక వసతులు కల్పిస్తామని ప్రకటించిన ప్రకటనలు హామిలకే పరిమితమయ్యాయని అన్నారు.

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అమలు చట్టం తెస్తామని మోడీ గద్దెనెక్కగా ఆ విషయం ప్రక్కన పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులకు రైతు బందు, 58 వేల కోట్ల ను అందించిందని కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో భాగంగా ఏడాదికి రూ. 6 వేలు అందిస్తామని గొప్పలు చెప్పుకుని తొలి విడుతలో 11.84 కోట్లను ఇచ్చి 2022 నాటికి రైతుల సంఖ్యను కుదించి 3.87 కోట్లు మాత్రమే పంపిణీ చేసిందని అన్నారు. దేశంలో ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

కేంద్రం ఒరవడితో రైతులకు అన్యాయం వరికళ్ళాలపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి దిశా నిర్దేశ్యం చేసే యోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటుచేస్తే అందుకు రాష్ట్రాన్ని కక్ష్యపూరితంగా యోచిస్తూ ఉపాధి హామి నిధులతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం పొలాల్లోని ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అవకాశం ఇచ్చిన వరి కళ్లాల నిధులు రూ. 150 కోట్లను వెనక్కి పంపాలని అంటూ కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు.

Related posts

శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం

Satyam NEWS

అక్రమ కేసు పెట్టి, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు

Satyam NEWS

మావోయిస్టు ప్రాంతాల్లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment