33.2 C
Hyderabad
April 25, 2024 23: 04 PM
Slider సంపాదకీయం

Analysis: కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకవు

#soniagandhi

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు రెండుగా విడిపోయి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ప్రవేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రశాంత్ కిషోర్ ను పార్టీలోకి తీసుకురావడంపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యతిరేకంగా ఉండగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావడంపై పట్టుబట్టి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ ను ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని సీనియర్లు మరి కొందరు సూచించారు. ప్రశాంత్ కిషోర్ ఒక వైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతూనే మరో వైపు కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు అయిన టీఆర్ఎస్ తో ఎన్నికల వ్యూహంపై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వైఖరి అవలంబిస్తే ఆయనను నమ్మడం కుదరదని వారు సోనియాగాంధీకి తేల్చి చెప్పారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మే 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ జరగనున్న మేధో మథనం సదస్సు ‘‘నవసంకల్ప్ చింతన్ శిబిర్’’ లో మరింత విస్త్రతంగా చర్చించిన తర్వాతే ప్రశాంత్ కిషోర్ ను పార్టీలోకి తీసుకోవాలని కూడా కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన 400 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో నవ సంకల్ప్ చింతన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇచ్చిన బ్లూప్రింట్ పై విశ్లేషణ జరిపేందుకు ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక కమిటీని సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. పి.చిదంబరం అధ్యక్షత వహించే ఈ కమిటీలో అంబికా సోనీ, ప్రియాంకా గాంధీ, ద్విగిజయ్ సింగ్, జైరామ్ రమేష్, ముకుల్ వాస్నిక్, కె సి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా ఉన్నారు.

ఈ కమిటీతో నిన్న సోనియాగాంధీ మరొక్క మారు సమావేశమయ్యారు. ఈ కమిటీ ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ పై విస్త్రతంగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ సూచించిన దాదాపు అన్ని సూచనలతో ఈ కమిటీ ఏకీభవించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం చేసుకున్నది.

దాంతో ఈ కమిటీలోని సగం మంది ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ పై సందేహాలు లేవనెత్తారు. దాంతో సోనియా గాంధీ కూడా ప్రశాంత్ కిషోర్ అంకిత భావంపై సంశయంలో పడ్డారని చెబుతున్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కల్పించేందుకు కిషోర్ 600 పేజీల ప్రజెంటేషన్ పై ఏర్పాటు చేసిన కమిటీనే కాకుండా మరో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ గుడ్డిగా నమ్మడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది.  

గాంధీ కుటుంబం పేరుతో ఆ పార్టీకి ఓట్లు పడటం లేదు. అయితే వారు లేకుంటే పార్టీ ముందుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా లేదన్నది వేరే విషయం. కొందరిని మినహాయిస్తే, చాలా మంది పార్టీ నాయకత్వాన్ని గాంధీ కుటుంబం చేతిలో ఉంచుకోవడాన్ని సమర్థిస్తున్నారు. అ

యితే ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనల్లో ఒకటి గాంధీ కుటుంబం పాక్షికంగా వైదొలగాలనేది. దీనిపై పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చెబుతున్నారు. పార్టీలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి G-23 పేరుతో కొందరు నాయకులు లేఖ కూడా రాశారు. ఈ G-23 లో కపిల్ సిబల్, మనీష్ తివారీ, శశి థరూర్, గులాం నబీ ఆజాద్, పి చిదంబరం వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు.

మరో వైపు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు ప్రత్యామ్నాయ నేతలుగా జాతీయ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు బీజేపీని సవాలు చేయలేవని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలు వేదికలపై బహిరంగంగా చెప్పారు. కాంగ్రెస్ నేత అయిన రాహుల్ గాంధీలో లోప్రతిపక్షాన్ని నడిపించేంత సత్తా లేదని కూడా కుండబద్దలు కొట్టారు.

బెంగాల్‌లో గెలిచినప్పటి నుంచి మమత నైతికత తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో, ఢిల్లీ తర్వాత, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆప్ తన పెరుగుతున్న ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే, మమత లాగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షానికి నాయకత్వం వహించడంపై ఇంకా తన మనసులోని భావనలు స్పష్టం చేయలేదు.

Related posts

విద్యార్ధుల నైపుణ్యాన్ని వెలికి తెచ్చే నయీ తాలీమ్

Satyam NEWS

విడుద‌ల‌కు సిద్ధ‌మైన విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌

Bhavani

రాష్ట్రనికి రానున్న బన్సల్

Bhavani

Leave a Comment