27.7 C
Hyderabad
April 19, 2024 23: 19 PM
Slider ముఖ్యంశాలు

ప్రధాని దిష్టి బొమ్మ దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం

#bjphyderabadcity

కాంగ్రెస్ పార్టీ గత 65 సంవత్సరాలలో దేశ పరిపాలనని గాలికి వదిలేసి అవినీతితో రాజ్యపాలన చేసిందని ప్రధాని మోడీ పార్లమెంటులో చెబితే టీఆర్ఎస్ ఎందుకు ఆందోళన చెందుతున్నదని బిజెపి నేతలు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన విషయం వేరు టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం వేరని వారన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, బిజెపి వెంగల్ రావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ దొర పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, దానికి పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

పెద్ద దొరకు చిన్న దొరకి అవి కనపడవు అని ఆయన ఎద్దేవా చేశారు.  రైతుల ఆత్మహత్యలు, రైతుల భూములు లాక్కుని పండుగ చేసుకోవడం ఎంత వరకు సహజమన్నారు. ధరణి అప్ తో కష్టాలు, ఉద్యోగులకు 317 జీఓ కష్టాలు, ఆయుష్మాన్ భారత్ ప్రవేశ పెట్టక పేద మధ్యతరగతి ప్రజల అనారోగ్యలతో అడుకుంటు లక్షల్లో మెడికల్ బిల్లులు వసూలు చేయడం, చదివి చదవని విద్యార్థుల నుండి కార్పొరేట్ విద్య సంస్థలతో కుమ్మక్కై బలవంతపు ఫీజులు వసూలు చేయడం, దళితులకు మొదటి నుంచి అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల స్వంత ఇంటి కల కలగానే మిగిలిందని, ఇలాంటి దొర పాలన పిచ్చి తుగ్లక్ పాలనని తలపిస్తుందని, ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్ర రెండు రాష్ట్రాల పాలనా చూసి మెడీ రాజ్యసభ లో ప్రస్తావన చేశారన్నారు. దానికీ చాలాకాలం నుండి పరిపాలన చేతకాక మొద్దునిద్రలో ఉన్న కేసీఆర్, టిఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడిలేచారన్నారు. రాష్ట్రoలో బిజెపి బలపడుతున్నది మా సీట్లు ఏమైపోతాయో నాని, ప్రజా సంక్షేమం పట్టని నాయకులు సీట్ల మీద ఉన్నప్రేమతో ప్రధానమంత్రి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో 100పైగా ఎమ్మెల్యే సీట్లు బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

పర్మిషన్ లేకుండా షూటింగ్ లో పాల్గొన్న మహేష్

Satyam NEWS

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

Satyam NEWS

విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ సందర్శన

Satyam NEWS

Leave a Comment