ఐ టి రంగం పై అవగాహన తో పాటు భవిష్యత్తు పట్ల స్పష్టమైన లక్ష్యాలున్నమంచి నాయకుడు మంత్రి కే టి రామారావు అని అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ అన్నారు. ఆయన కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండోసారి మంత్రి అయిన కేటీఆర్‌కు జోయల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జోయల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ భవిష్యత్ పట్ల స్పష్టమైన లక్ష్యాలున్న నాయకుడితో మరింత దగ్గరగా కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.దీనికి స్పందిస్తూ కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post