25.2 C
Hyderabad
October 15, 2024 12: 05 PM
Slider సినిమా

దగ్గుబాటి సురేశ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు

SURESH-BABU-602x400

తెలుగు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా వెలుగొందుతున్న రామానాయుడి వారసులను కూడా ఐటి అధికారులు వదలడం లేదు. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అయిన దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు నేడు దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగు తున్నాయి. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. రామానాయుడు స్టూడియో తో పాటు మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు దొరికినట్లు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు. గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది.

Related posts

ఆసరా పింఛన్‌ దరఖాస్తులకు రుసుం వసూలు చేయవద్దు

Satyam NEWS

గణపయ్య మెడలో “నాగాభరణం”

Satyam NEWS

సెలబ్రేషన్స్: సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా మాగంటి

Satyam NEWS

Leave a Comment