ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ మెగా ఇంజనీరింగ్ సంస్థ కార్యాలయాలపై ఇన్ కం టాక్సు దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వారి కార్యాలయంతో బాటు దేశంలోని పలు ప్రాంతాలలో వారి కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందుతున్నది. రెండు నెలల కిందట మెగా కంపెనీపై ఇదే తరహా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఐటి దాడులు జరగడం చర్చనీయాంశమైంది. జూబిలీహిల్స్ లోని మెగా ఇంజనీరింగ్ కంపెనీ చైర్మన్ పిచ్చిరెడ్డి నివాసంలోనూ, ఎండి కృష్ణారెడ్డి ఇంటిలోనూ బాలానగర్ లోని కంపెనీ ప్రాంగణంలోనూ దాదాపు 20 మంది సీనియర్ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం పెద్దల ఆశీస్సులతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇటీవల ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే కాంట్రాక్టు కూడా తీసుకున్నవిషయం తెలిసిందే. అంతే కాకుండా మెగా ఇంజనీరింగ్ కంపెనీ దేశంలోని చాలా ప్రాంతాలలో ప్రతిష్టాత్మక ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపడుతున్నది. జిఎస్ టి వయొలేషన్స్ కు సంబంధించి ఐటి రైడ్ జరుగుతున్నట్లు చెబుతున్నా అంతకు మించిన కారణాలే ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన దాడుల్లో లభించిన ఆధారాలను ఇతర మార్గాలలో ఖరారు చేసుకుని రెండో సారి తనిఖీలు చేపడుతున్నట్లు గా చెబుతున్నారు.
previous post