హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. స్వస్తిక్ గ్రూప్ నకు చెందిన కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్ నగర్ చేవెళ్ల బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
next post