30.7 C
Hyderabad
April 17, 2024 01: 14 AM
Slider ప్రత్యేకం

రైడ్:ఇంకా ఎన్ని వందల కోట్లు బయటకు వస్తాయో????

chandrababu PA 23

ఎన్ని వందల కోట్ల రూపాయల లావాదేవీలు బయటికి వస్తున్నయ్యో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడి మాజీ పి స్ శ్రీనివాస్ ఇంట్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరుకున్నాయి.

మొదటి రోజు సాయంత్రం వరకే సుమారుగా రూ.150 కోట్లు బయటపడ్డట్టు అనధికారిక వార్తలు వెలుడగా రెండో రోజు ఎంత బయటపడింది అనధికారికంగా కూడా తెలియలేదు. మూడో రోజు కూడా ఐటీ అధికారులు నిర్విరామంగా సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ఇంట్లో నుంచి రహస్య లాకర్లను నిన్న ఐటి శాఖ అధికారులు కనుగొన్నట్లు తెలిసింది. ఈ రహస్య లాకర్ల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిసింది.

ఈ కీలక పత్రాలలో చంద్రబాబు లేదా లోకేష్ పేర్లు ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్రంలో వైండప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదూ, వారికి తెలియకుండానే శ్రీనివాస్ ఇంత పెద్ద మొత్తంలో నల్ల ధనం కూడబెట్టి ఉంటే అతను ఒక్కడే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఐటి అధికారుల సోదాల తర్వాత వారి సిఫార్సుల మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తదితర సంస్థలు రంగంలో దిగుతాయి. ప్రధాన మీడియాగా చెప్పుకునే పత్రికలు, ఛానెల్స్ ఈ ఐటి దాడులకు సంబంధించిన వార్తలను బ్లాకౌట్ చేస్తున్నాయి.

Related posts

విద్యార్థులకు న్యాయం చేయాలి

Sub Editor

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Satyam NEWS

క్రైమ్ త్రిల్లర్: అప్పు చెల్లించమన్నందుకు కత్తులతో దాడి

Satyam NEWS

Leave a Comment