Slider గుంటూరు

జేఏసీ రిక్వెస్ట్: బంద్ కు సహకరించండి

nrt jac

రాజధాని అమరావతిని విచ్చిన్నం చేయటానికి తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపటి బంద్ కు అందరూ సహకరించాలని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజధాని రైతులు, మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి దారుణంగా ప్రవర్తించారని ఆయన అన్నారు.

ఈ చర్యలకు నిరసనగా రేపు బుధవారం గుంటూరు జిల్లా బంద్ కు జిల్లా జెఎసి పిలుపునివ్వడం జరిగిందని డాక్టర్ చదలవాడ తెలిపారు. రేపు ఉదయం 09:00 గంటల నుంచి జరిగే బంద్ కు నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ బంద్ కి సహకరించి జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.

Related posts

సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Satyam NEWS

యాక్షన్ ప్లాన్: నిమ్స్ లో కరోనా వార్డు ఎలావుంది?

Satyam NEWS

హూదూద్ లబ్ధి దారులు కి ఇండ్లను అప్ప చెప్పాలంటున్న సీపీఎం

Satyam NEWS

Leave a Comment