29.7 C
Hyderabad
May 1, 2024 03: 53 AM
Slider వరంగల్

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

#jac

సిపిఎస్ రద్దు, పి ఆర్ సి కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి, పెండింగ్ DA ల విడుదల తదితర అంశాలపై పోరాటం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి  (జేఏసీ) నిర్ణయించింది. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. TSCPSEU జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో TTU జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్, STU జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధు సూదన్,  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు  మడుగురి నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కిర్మాణి తదితర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హాజరయ్యారు. 15 వ తేదీ నాడు  ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి  (జేఏసీ) గా ఏర్పాటు కాబోతున్నాయని TTU జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్, STU జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధు సూదన్, TSCPSEU జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ , తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు  మడుగురి నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కిర్మాణి లు  తెలిపారు. ఈ సమావేశానికి ములుగు జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇదే మా పిలుపుగా భావించి హాజరవాల్సిందిగా కోరారు.

Related posts

మహిళా సాధికారత ధ్యేయంగా అంబేద్కర్ ఆలోచనా విధానం

Satyam NEWS

అంబర్ పేట్ లో గోపీనాథ్ ముండే జయంతి

Satyam NEWS

మతిస్థిమితం లేని ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే చెప్పండి

Satyam NEWS

Leave a Comment