28.7 C
Hyderabad
April 20, 2024 03: 47 AM
Slider ఆధ్యాత్మికం

నేడు జగద్గురు శ్రీ మధ్వాచార్యుల జయంతి

#Jagadguru Madhvacharya

దక్షిణ భారతదేశానికి చెందిన ముగ్గురు మతాచార్యుల లో ప్రముఖులు జగద్గురువు అయిన శ్రీ మధ్వాచార్యుల జయంతి నేడు. గద్వాల జిల్లాలోని ఆది శిలా క్షేత్రం అయిన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం లో ద్వైత, అద్వైత ,విశిష్టాద్వైత ఆచారాలకు  చెందిన పూజలు జరుగుతున్నాయి.

ద్వైత మతానికి చెందిన శ్రీ మధ్వాచార్యులు అద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులను పూర్ణ ప్రజ్ఞ ,ఆనంద తీర్థ అని కూడా పిలుస్తారు. మద్వాచార్యులు హనుమంతుడు భీముడు అనంతరం వాయుదేవునకు  తృతీయ అవతారమని నమ్మకం ఉంది. కర్ణాటకలోని ఉడిపి లో 1238 లో జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.

మద్వాచార్యులు దక్షిణ భారతదేశమంతా పర్యటించారని, అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు. మధ్వాచార్యుల తల్లిదండ్రులు అప్పు చేయగా తన తపోశక్తితో అప్పు అడిగేవారికి చింతకాయ బిచ్చలు అందజేసి వాటిని ఇంటికెళ్లి చూడమని తెలపగా అప్పు ఇచ్చిన వారు ఇంటికి వెళ్లి చూడగా చింత బిచ్చలు బంగారు నాణేలుగా మారాయి.

మధ్వాచార్యుల జయంతి సందర్భంగా ఆదిశిలా క్షేత్రంలో ఆయన విగ్రహానికి ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్యులు పట్వారి ప్రహలాద రావు, ఈఓ సత్యచంద్ర రెడ్డి, శేష దాస వంశీయులు ధీరేంద్ర దాస్ అర్చకులు మధుసూదనాచారి, రమేష చారి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.

ద్వైత ,అద్వైత, విశిష్టాద్వైత మతాల ఆచారం ప్రకారం నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలలో ఆగమ పద్ధతిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. ద్వైత మతం ప్రకారం ఇక్కడ పశ్చిమాభిముఖంగా ఆంజనేయ స్వామి, అద్వైత మతం ప్రకారం ఈశ్వరుడు తపస్సు చేసి విష్ణువును ఈ క్షేత్రం కు ఆహ్వానించిన సందర్భంగా ఈశ్వరప్రతిష్ఠ దేవరగట్టుపై జరుగుతున్నది. త్వరలో శంకరాచార్య విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు.

విశిష్టాద్వైతం ప్రకారం విష్ణు వెలిసి నందున రామానుజుల విగ్రహాలు కూడా నెలకొల్పారు. మల్దకల్ పుణ్యక్షేత్రంలో దాస చతుష్టయానికి చెందిన పురందరదాసు, విజయ దాసులు, జగన్నాథ దాసులు, గోపాల దాసులు సన్నిధానం గా వేద పాఠశాల అలరిస్తున్నది.

అపరోక్ష జ్ఞానం గంగా భాగీరథి నది ని తిమ్మప్ప పాదాల చెంతకు రప్పించిన శ్రీ శేష దాసుల బృందావనము కూడా ఇక్కడ ఉండటం గర్వించదగ్గ విషయం.

Related posts

యూనిసెఫ్ ఏలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో అవగాహన

Satyam NEWS

Analysis: సరిహద్దుల్లో చెత్త గేమ్ ఆడుతున్న చైనా

Satyam NEWS

పంచాయితీ ఎన్నికలకు మరో మొలిక పెట్టిన ఏపి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment