24.7 C
Hyderabad
July 18, 2024 06: 52 AM
Slider ప్రత్యేకం

ఘోరంగా ఓడిపోయిన జగన్ రెడ్డి కొత్త రాగం

#jaganmohan

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన జగన్ రెడ్డి తనను ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని మరుగునపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన ఈవీఎంలపై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ అని అన్నారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగానే టీడీపీ, జనసేన కౌంటర్ ఇచ్చాయి. జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి.. 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని టీమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది.‘‘ నువ్వు పిరికివాడివి కాబట్టి మమ్మల్ని బ్లాక్ చేసుకున్నావ్. అందుకే జనాలు నీ పార్టీని రాష్ట్రం నుంచి బ్లాక్ చేసేశారు.

ఇంకా నువ్వు ఈవీఎంల మీద ఏడుస్తున్నావ్. ఈ వీడియోలో ఈవీఎంల పనితీరు గురించి పులివెందుల ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు. విని తరిస్తావని ఆశిస్తున్నాం. అలాగే ఇలాంటి చచ్చు సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాలు వింటే ఉన్న 11లో 1 మాత్రమే మిగులుతుంది అని ప్రజలు అంటున్నారు’’ అని పంచ్‌లు పేల్చింది.

Related posts

విజయవంతంగా వార్డు సెక్రటేరియేట్ పరీక్షలు

Satyam NEWS

‘ERROR500” టీజర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని

Bhavani

*అభిమానం హద్దులు దాటితే?

Bhavani

Leave a Comment