ఏపీలో గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం అంశం హాట్ టాపిక్‌గా మారింది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై జనసేన నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. దీంతో ఇదే అదునుగా వైసీపీ కూటమిలో మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. తెలుగుదేశం, జనసేన మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం చేసేందుకు విఫల ప్రయత్నం చేసింది. ఐతే అలర్ట్ అయిన తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడొద్దని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశాయి.
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ…ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తద్వారా లబ్ధిపొందాలనేది వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, కేబినెట్‌లో ఎవరుండాలి, ఏ శాఖలు ఎవరికి కేటాయించాలనేది కూటమి ప్రభుత్వ అంతర్గత విషయం. ఆ విషయంలో వివాదం తలెత్తితే మూడు పార్టీలు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాయి.
ఐతే వైసీపీ మాత్రం చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు చేస్తోంది. కానీ కూటమి నేతలు వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. దీంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో తోచడం లేదని సమాచారం. ఇక డిప్యూటీ సీఎం అంశంపై ఫస్ట్ టైం నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ తనకు ప్రస్తుతం చేయినిండా పని ఉందని, తన దగ్గరున్న విద్యా శాఖలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవిపై పెద్దగా ఆసక్తి లేదని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ సీఎం వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది.