వైఎస్ జగన్ పబ్లిక్‌గా మాట్లాడే సమయంలో ఎప్పుడూ ఓ పేపరు ఉండాల్సిందే. అందులో చూస్తేనే వైసీపీ అధినేత కాస్తో కూస్తో కాన్పిడెంట్‌గా మాట్లాడగలరు. గత ఐదేళ్లుగా ఇదే చేశారు. ఏ రోజూ ఎంత ముఖ్యమైన విషయమైనా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పాపాన పోలేదు. ప్రతిదానికి సజ్జల రామక్రిష్ణా రెడ్డినే మీడియా ముందుకు పంపేవారు. ఆఖరికి కరోనా వంటి సమయంలో కూడా జగన్ రెడ్డి మీడియా ముందుకు రాలేదు. ఆ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. ఒంటరిగా ప్రెస్ మీట్ వీడియో రికార్డు చేయించి, దాన్ని చక్కగా ఎడిట్ చేయించి బయటకు వదిలేవారు.
దాంతో జగన్ మోహన్ రెడ్డి లైవ్‌లో సునాయసంగా మాట్లాడలేరని, ఒకవేళ ప్రయత్నించినా పుట్టెడు తప్పులతో వైరల్ అవుతుంటారనే ముద్ర పడిపోయింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడూ కనీసం ఒక్కసారి కూడా జగన్ సొంత మాటలు మాట్లాడలేదు. ఏదైనా ప్రభుత్వ బహిరంగ సభ అయినా, పార్టీ నిర్వహించిన సిద్ధం సభలైనా, రోడ్ షో అయినా లేదా పార్టీ నాయకులతో మీటింగ్ అయినా తన మైక్ దగ్గర ఓ స్క్రిప్టు ఉండాల్సిందే. లేదంటే జగన్ నోటి వెంట మాట వచ్చేది కాదు. ఆఖరికి చంద్రబాబును, లోకేశ్ ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలన్నా కూడా స్క్రిప్టు ఉండాల్సిందే.
అధికారంలో ఉన్నంత కాలం జగన్ కు స్క్రిప్టులు రాసిచ్చేవారు ఎందరో ఉండేవారు. ఆ స్క్రిప్టులే కాక, జనాల మధ్యలో పేటీఎం బ్యాచ్ లను ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలోకి రాకమునుపు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ ఈ స్పీచ్ ల విషయంలో మంచి స్క్రిప్టులు రాసిచ్చేది. తర్వాత పీకే వెళ్లిపోయిన ఐ ప్యాక్ టీమ్ సాయం చేసేది. ఆ స్కి్ప్టులు ఉంటేనే జగన్.. జగన్ లాగా కనిపించేవారు. కానీ, ఇప్పుడు వారెవరూ జగన్ వెంట లేకపోవడంతో జగన్ అనే వ్యక్తి అసలు కామెడీ స్వరూపం బయటపడింది.
జగన్ మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనతో వైసీపీలో అనేక లొసుగులు కనిపించాయనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ కు ఎవరూ స్పీచ్ రాసివ్వలేదు. నేరుగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చేశారు. అలా జగన్ స్పీచ్ మధ్యలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సమాధానం చెప్పలేక.. ఆగప్పా.. ఫ్లో పోతోంది.. అని అంటూ జగన్ నవ్వులపాలు అయ్యారు. ఈ రకంగా జగన్ వ్యవహార శైలి బాగా వైరల్ అవుతోంది. అంటే జగన్ స్క్రిప్ట్ లేకుండా పేటీఎమ్ టీమ్ లేకుండా.. ప్రశాంత్ కిశోర్ లేకుండా సీఎం అయ్యే అవకాశమే లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.