మహేష్ బాబు
ఫేస్బుక్ ఫాలోవర్స్ – 14M
ట్విట్టర్ ఫాలోవర్స్ – 13.8M
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ – 14.5M
అల్లు అర్జున్
ఫేస్బుక్ ఫాలోవర్స్ – 21M
ట్విట్టర్ ఫాలోవర్స్ – 8.5M
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ – 28.5M
రామ్ చరణ్ తేజ్
ఫేస్బుక్ ఫాలోవర్స్ – 11M
ట్విట్టర్ ఫాలోవర్స్ – 4M
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ – 26M
విజయ్ దేవరకొండ
ఫేస్బుక్ ఫాలోవర్స్ – 11M
ట్విట్టర్ ఫాలోవర్స్ – No Account
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ – 21.9M
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఫేస్బుక్ ఫాలోవర్స్ – 2.2M
ట్విట్టర్ ఫాలోవర్స్ – 2.7M
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ – 1.1M
ఇది సోషల్ మీడియాలో హీరోలకి ఉన్న ఫాలోవర్స్ సంఖ్య.. వారితో పోలిస్తే జగన్ ఫాలోవర్స్ ఎంత తక్కువగా ఉన్నారో చూశారా.! జగన్ కి అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉన్న ఫాలోవర్స్ మొత్తాన్ని కలిపినా నిన్న కాక మొన్న హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో పావు వంతు కూడా లేరు.. పబ్లిక్ లో సినిమా హీరోలకి ఉన్న క్రేజ్ అలా ఉంటుంది.. రాజకీయ నాయకుల కన్నా సినిమా హీరోలకి జనాల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది..
అలాగే రాజకీయాలను ఇష్టపడే ప్రజల కంటే సినిమాలను ఇష్టపడే ప్రజల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఉంటుంది.. కాబట్టి ఒక రాజకీయ నాయకుడి అభిమానులు పనిగట్టుకుని ఒక సినిమాను ఫ్లాప్ చెయ్యడం అనేది అది జరగని పని.. సినిమాలో మ్యాటర్ ఉంటే, సినిమా బాగుంటే ఏ నాయకుడి అభిమానులైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సినిమాని ఫ్లాప్ చెయ్యడం అనేది జరగని పని.. మహా ఐతే కొద్దిగా కలెక్షన్స్ తగ్గించగలరు.. అంతకు మించి చెయ్యడం అనేది జరగని పని.. వైసీపీకి 40% ఓటింగ్ వచ్చింది అంటే వాళ్లంతా జగన్ అభిమానులు అని కాదు అర్థం..
మీరు ఒక్కోసారి ఒక్కో హీరోను కెలికి చూడండి వైసీపీకి ఎంత ఓటింగ్ తగ్గుతూ వస్తుందో చివరికి ఎంత ఓటింగ్ మిగులుతుందో మీకే తెలుస్తుంది.. అంటే ఎంతోమంది హీరోల అభిమానులు వైసీపీకి జగన్ కి ఓటేస్తేనే మీకు 40% ఓటింగ్ వచ్చింది తప్ప ఆ ఓటింగ్ అంతా ఒక్క జగన్ అభిమానులు వేస్తేనే వచ్చినట్టు కాదు.. కానీ ఒక హీరో అభిమానులు తలచుకుంటే 0.5-2% ఓటింగ్ వరకు తగ్గించి గెలుపు ఓటములు సైతం ప్రభావితం చెయ్యగలరు.. 2014లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఓటింగ్ వలన 1.5% తేడాతో ఎలక్షన్ రిజల్ట్ మీద ఎంత ప్రభావం చూపిందో చూసారుగా..
ఇక వైసీపీ వారు విశ్వక్ సేన్ సినిమాను ఫ్లాప్ చేశారు అనేది మీ భ్రమ మాత్రమే.. ఒకవేళ లైలా సినిమాకి మార్నింగ్ షోతో హిట్ టాక్ వచ్చి ఉంటే మధ్యాహ్నం నుండే షోస్ ఫుల్ అవుతూ వచ్చి సాయంత్రానికి థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడేవి.. విశ్వక్ సేన్ గత చిత్రాల్లో మెకానిక్ రాకీ, వెళ్ళిపోమాకే, ఓరి దేవుడా లాంటివి ఫ్లాప్ అయ్యాయి అవి వైసీపీ వారు ఫ్లాప్ చెయ్యడం వల్లనే ఫ్లాప్ అయ్యాయా?? ఫలక్ నుమా దాస్, హిట్, ఈ నగరానికి ఏమైంది సినిమాలు హిట్ అయ్యాయి.. వైసీపీ వాళ్లు చేస్తేనే హిట్ అయ్యాయా?? కాబట్టి సినిమాలో స్టఫ్ లేక ఫ్లాప్ అయిన సినిమాని ఎవడూ కాపాడలేడు.
మ్యాటర్ ఉండి హిట్ అయిన సినిమాని ఎవడూ ఫ్లాప్ చెయ్యలేడు.. రాజకీయం వేరు, సినిమాలు వేరు.. ఇక్కడ మనకి రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ లో 10% ఇంట్రెస్ట్ కూడా సాధారణ జనానికి ఉండదు.. ఫ్లాప్ అయిన సినిమాను పట్టుకుని మన పార్టీ సోషల్ మీడియా తలచుకుని ఆ సినిమాను ఫ్లాప్ చేశాం ఈ సినిమాను ఫ్లాప్ చేశాం అని మానసిక ఆనందం పొందడమే తప్ప అందులో ఎంతమాత్రం నిజం ఉండదు..
అజయ్ అమృత్