వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నారా లోకేశ్ అంటేనే వణికిపోతున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తూ కూడా పదే పదే లోకేశ్ పేరు తలుస్తూ భయపడిపోతున్నారు. జాతీయ మీడియా సాక్షిగా లోకేశ్ పై జగన్ కు ఉన్న భయం ఏ స్థాయిలో ఉందో బట్టబయలు అయింది. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, సభను ఎగ్గొట్టి మరీ ఢిల్లీలో ధర్నా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, రాష్ట్రపతి పాలన విధించాలని అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చారు.
టీడీపీ హాయాంలో ఇంతగా దారుణాలు జరుగుతున్నాయని జగన్ పదే పదే అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నం చేస్తుండగా.. అసలు ఆయన హాయాంలో జరిగిన దారుణాలు జగన్ కు గుర్తున్నాయా అని టీడీపీ నేతలే కాక, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సొంత బాబాయి అయిన వివేకానంద రెడ్డి హత్య కేసును గత ఐదేళ్లుగా పట్టించుకోనేలేదు. దళితుడిని చంపి ఓ వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా డోర్ డెలివరీ చేశాడు. అయినా జగన్ ఆ నిందితుడ్ని వెనకేసుకొచ్చారు.
ఇంకా జగన్ హాయాంలో ఏకంగా 2,686 హత్యలు జరిగాయి. జగన్ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా కనిపించేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో జగన్ నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజీ వచ్చేట్లుగా వారికి తాయిలాలు సమర్పించుకున్నారు. అందులో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఇండియా టుడేతో అన్నారు. అది నారా లోకేశ్ రెడ్ బుక్ అని.. ఏపీ వ్యాప్తంగా దాని హోర్డింగులు పెట్టారని అన్నారు.
టీడీపీ వచ్చినప్పటి నుంచి పదుల సంఖ్యలో హత్యలు జరిగాయని.. కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వాపోయారు. అంతటికి లోకేశ్ రెడ్ బుక్కే కారణమని.. జగన్ వణుకుతున్న స్వరంతో నేషనల్ మీడియాతో చెప్పడం ఆయనలోని భయాన్ని చాటుతోంది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. డుమ్మా కొట్టి ఢిల్లీలో కూర్చొన్న జగన్ కు ఇక్కడ ఏపీలో పరిస్థితులు మరింత వ్యతిరేకంగా మారుతున్నాయి.
జగన్ రెడ్డి తన పాలనలో జరిగిన అరాచకాలను మర్చిపోయినట్లు నటిస్తున్నప్పటికీ.. ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో జగన్ మోహన్ రెడ్డి రాద్ధాంతం అంతా ఆయన అభద్రతా భావాన్ని చాటుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ జగన్ తీరుపై టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, గౌతు శిరీష సహా పలువురు స్పందించారు.